కొవాగ్జిన్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతి

ABN , First Publish Date - 2021-11-04T00:14:06+05:30 IST

భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ కొవాగ్జిన్ అత్యవసర వినియోగానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ

కొవాగ్జిన్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతి

న్యూఢిల్లీ: భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ కొవాగ్జిన్ అత్యవసర వినియోగానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఆ సంస్థకు టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ (టీఏజీ) పేర్కొంది. టీఏజీ అనేది డబ్ల్యూహెచ్ఓ స్వతంత్ర సలహా కమిటీ.


కరోనా టీకాలను అత్యవసర వినియోగ జాబితా (ఈయూఎల్)లో చేర్చాలా? లేదా? అనే విషయాన్ని ప్రతిపాదిస్తుంది. కొవాగ్జిన్‌ను ఈయూఎల్‌కు ప్రతిపాదించాలంటే చివరిసారి రిస్క్ బెనిఫిట్‌ను అంచనా వేయాల్సి ఉంటుందని కాబట్టి అదనపు సమాచారం పంపించాలని గత నెల 26న భారత్ బయోటెక్‌ను కోరింది. 


టీఏజీ అనుమతిపై ప్రభుత్వ వర్గాలు మాట్లాడుతూ దీనర్థం 18 ఏళ్లు, ఆపై బడిన వారికేనని, చిన్న పిల్లల వినియోగానికి కాదని పేర్కొన్నాయి. పిల్లలకు అనుమతి కోసం ఇంకా దరఖాస్తు చేసుకోలేదన్నారు. కొవాగ్జిన్ టీకా లక్షణాలు కలిగిన కొవిడ్-19పై 77.8 శాతం, డెల్టా వేరియంట్‌పై 65.2 శాతం రక్షణ కల్పిస్తున్నట్టు క్లినికల్ పరీక్షల్లో నిర్ధారణ అయింది. కొవాగ్జిన్ ప్రభావశీలతపై ఫేజ్-3 ట్రయల్స్‌పై చివరి విశ్లేషణ కూడా పూర్తయినట్టు భారత్ బయోటెక్ ఈ ఏడాది జూన్‌లోనే ప్రకటించింది.  

Updated Date - 2021-11-04T00:14:06+05:30 IST