Advertisement
Advertisement
Abn logo
Advertisement

కనిగిరి నగర పంచాయతీ కమిషనర్‌ ఎవరు?

ప్రకాశం: జిల్లాలోని కనిగిరి నగర పంచాయతీ కమిషనర్‌ ఎవరు అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. నగర పంచాయతీ కమిషనర్‌గా డీటీవీ కృష్ణారావును నియమిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో విధుల్లో చేరేందుకు కార్యాలయానికి కృష్ణారావు వచ్చారు. అయితే ఆఫీస్‌కి తాళాలు వేసి కృష్ణారావును నగర పంచాయతీ సిబ్బంది బయటే నిలబెట్టారు. గతంలో కూడా కమిషనర్‌గా విధుల్లో చేరేందుకు మూడుసార్లు కృష్ణారావు వచ్చారు. గత కమిషనర్ రిలీవ్ కాకపోవటంతో తన విధుల్లో చేరకుండానే డీటీవీ వెనుదిరిగారు. తాజాగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బాధ్యతలు స్వీకరించేందుకు కమిషనర్ కృష్ణారావు వచ్చారు. 

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement