కరోనాపై మేము తీసుకున్న చర్యలనూ సమీక్షించుకుంటాం: డబ్ల్యూహెచ్ఓ

ABN , First Publish Date - 2020-07-10T04:28:06+05:30 IST

కరోనా మహమ్మారి కట్టడిలో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) విఫలమైందంటూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆరోపణలు గుప్పిస్తున్న నేపథ్యంలో డబ్ల్యూహెచ్ఓ కీలక నిర్ణయం తీసుకుంది.

కరోనాపై మేము తీసుకున్న చర్యలనూ సమీక్షించుకుంటాం: డబ్ల్యూహెచ్ఓ

జెనీవా: కరోనా మహమ్మారి కట్టడిలో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) విఫలమైందంటూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆరోపణలు గుప్పిస్తున్న నేపథ్యంలో డబ్ల్యూహెచ్ఓ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనాపై ఇప్పటి వరకూ తాము చేపట్టిన చర్యలను కూడా నిష్పాక్షికంగా సమీక్షించుకుంటామని తెలిపింది. ఈ మేరకు డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ అథానమ్ ఓ ప్రకటన విడుదల చేశారు. కరోనా కట్టడి విషయంలో డబ్ల్యూహెచ్ఓతో పాటూ ఇతర దేశాలు తీసుకున్న చర్యలపై సమీక్ష నిర్వహించేందుకు ఓ స్వతంత్ర ప్యానెల్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన గురువారం ప్రకటించారు. ‘ఇది సింహావలోకనం చేసుకోవాల్సి సమయం. దీని ద్వారా కరోనా సంక్షోభానికి సంబంధించి నిజానిజాలు ప్రపంచానికి తెలుస్తాయి. మానవ సమాజానికి ఉజ్వల భవిష్యత్తు అందించేందుకు చేపట్టాల్సిన చర్యలుపైనా చర్చిస్తాం’ అని టెడ్రోస్ అథానమ్ వ్యాఖ్యానించారు. 

Updated Date - 2020-07-10T04:28:06+05:30 IST