మరిన్ని కొత్త వేరియంట్లు వచ్చే అవకాశం ఉంది: డబ్ల్యూహెచ్ఓ చీఫ్

ABN , First Publish Date - 2022-01-21T02:57:43+05:30 IST

ఒమైక్రాన్ వేరియంట్ తీవ్రమైనది కాదన్న భావన ప్రమాదకరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అథానమ్ మంగళవారం హెచ్చరించారు.

మరిన్ని కొత్త వేరియంట్లు వచ్చే అవకాశం ఉంది: డబ్ల్యూహెచ్ఓ చీఫ్

ఇంటర్నెట్ డెస్క్: ఒమైక్రాన్ వేరియంట్ తీవ్రమైనది కాదన్న భావన ప్రమాదకరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అథానమ్ మంగళవారం హెచ్చరించారు. ఒమైక్రాన్ విపరీతంగా వ్యాపిస్తున్న కారణంగా మరిన్ని కొత్త కరోనా వేరియంట్లు వచ్చే అవకాశం లేకపోలేదని ఆయన ప్రపంచ దేశాలను అలర్ట్ చేశారు. కరోనా సంక్షోభం ముగింపు దరిదాపుల్లో కూడా లేదని, అందరికీ టీకా వేస్తేనే ఈ మహమ్మారికి చెక్ పెట్టగలమని ఆయన మరోసారి ఉద్ఘాటించారు. టీకాకరణ విస్త్రతమైతే..ఆస్పత్రులు కరోనా రోగులతో కిక్కిరిసిపోయే దుస్థితిని నివారించవచ్చని తెలిపారు. ‘‘ఒమైక్రాన్ వేరియంట్ తీవ్రమైనది కాదన్న భావన తప్పుదారి పట్టించేదిగా  ఉంది. దీని వల్ల..సమాజం తీసుకునే రక్షణ చర్యలపై ప్రతికూల ప్రభావం పడుతుంది. అనేక మంది ప్రాణాలు కోల్పోతారు’’ అంటూ స్పష్టమైన హెచ్చరికలు చేశారు. 

Updated Date - 2022-01-21T02:57:43+05:30 IST