కొవిడ్ చికిత్సకు రెండు కొత్త ఔషధాలు... WHO recommend

ABN , First Publish Date - 2022-01-14T16:12:30+05:30 IST

ఒమైక్రాన్ వేరియెంట్‌తో రెట్టింపు వ్యాప్తి నేపథ్యంలో కొవిడ్-19తో పోరాడేందుకు రెండు కొత్త ఔషధాలను ఉపయోగించాలని...

కొవిడ్ చికిత్సకు రెండు కొత్త ఔషధాలు... WHO recommend

న్యూఢిల్లీ: ఒమైక్రాన్ వేరియెంట్‌తో రెట్టింపు వ్యాప్తి నేపథ్యంలో కొవిడ్-19తో పోరాడేందుకు రెండు కొత్త ఔషధాలను ఉపయోగించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ప్యానెల్ సిఫార్సు చేసింది.కొవిడ్-19 చికిత్స కోసం ఫైజర్ డ్రగ్ కోసం జపాన్ ప్రభుత్వ అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నట్లు డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. కొవిడ్-19 రోగుల కోసం  వీర్ బయోటెక్నాలజీ ద్వారా ఎలి లిల్లీ, గ్లాక్సో స్మిత్‌క్లైన్ అనే రెండు కొత్త ఔషధాలను ఉపయోగించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్యానెల్ సిఫార్సు చేసింది. కార్టికోస్టెరాయిడ్స్‌తో కలిపి తీవ్రమైన కొవిడ్ -19 ఉన్న రోగులకు ఒలుమియంట్ బ్రాండ్ పేరుతో విక్రయిస్తున్న లిల్లీస్ బారిసిటినిబ్‌ డ్రగ్ ను సిఫార్సు చేసింది. 




ఆసుపత్రిలో చేరే ప్రమాదం ఎక్కువగా ఉన్న తీవ్రమైన రోగులకు జీఎస్‌కే వీర్ యొక్క యాంటీబాడీ థెరపీని షరతులతో ఆమోదించింది.అత్యంత రక్షిత ఎన్95 మాస్క్‌లను అమెరికన్లకు ఉచితంగా పంపిణీ చేయడానికి జో బిడెన్ అంగీకిరించారు. అమెరికాలో కొవిడ్-19 పరీక్షలను ఒక బిలియన్ కు రెట్టింపు చేస్తామని బిడెన్ ప్రకటించారు.


Updated Date - 2022-01-14T16:12:30+05:30 IST