కరోనా పూర్తిగా అంతమయ్యే అవకాశం తక్కువే: డబ్ల్యూహెచ్ఓ

ABN , First Publish Date - 2020-07-11T15:13:59+05:30 IST

కరోనా మహమ్మారిని పూర్తిగా అంతం చేసే అవకాశం తక్కువేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచఓ) ఎమర్జెన్సీ ప్రోగ్రామ్ చీఫ్ డా. మైక్ రయాన్ తెలిపారు.

కరోనా పూర్తిగా అంతమయ్యే అవకాశం తక్కువే: డబ్ల్యూహెచ్ఓ

జెనీవా: కరోనా మహమ్మారిని పూర్తిగా అంతం చేసే అవకాశం తక్కువేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) ఎమర్జెన్సీ ప్రోగ్రామ్ చీఫ్ డా. మైక్ రయాన్ తెలిపారు.‘ప్రస్తుత పరిస్థితుల్లో వైరస్‌ను పూర్తిగా నిర్మూలించే అవకాశం తక్కువే’ అని ఆయన వ్యాఖ్యానించారు. అయితే ఎక్కువ కేసుల ఉన్న ప్రాంతాల్లో వైరస్‌ను నిర్మూలించడం ద్వారా కరోనా రెండోసారి విజృంభించకుండా చేయొచ్చని తెలిపారు. తద్వారా లాక్ డౌన్‌లు విధించే అగత్యం తప్పుతుందన్నారు.


ఇక అమెరికాకు చెందిన జాన్ హాప్‌కిన్స్ యూనివర్శీటీ తాజా లెక్కల ప్రకారం.. ప్రపంచంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1.2 కోట్లను దాటింది. 5,59,481 కరోనా మరణాలు సంభవించాయి. 68 లక్షల మందికి పైగా కరోనా నుంచి కోలుకున్నారు. భారత్‌లో కరోనా తీవ్రత అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో దేశం మరో కరోనా హాట్‌స్పాట్‌గా మారబోతోందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కేసుల పరంగా చూస్తే.. భారత్ ప్రస్తుతం మూడో స్థానంలో ఉన్న విషయం తెలిసిందే.

Updated Date - 2020-07-11T15:13:59+05:30 IST