కండోములు.. కొన్ని అపోహలు

ABN , First Publish Date - 2022-01-30T01:04:43+05:30 IST

ఓపెన్ రిలేషన్స్, పాలిమరీ (బహుభార్యత్వం), ‘సిట్యుటేషన్‌షిప్స్’ తదితర పదాలు నేటి డేటింగ్ నిఘంటువును..

కండోములు.. కొన్ని అపోహలు

న్యూఢిల్లీ: ఓపెన్ రిలేషన్స్, పాలిమరీ (బహుభార్యత్వం), ‘సిట్యుటేషన్‌షిప్స్’ తదితర పదాలు నేటి డేటింగ్ నిఘంటువును మరింత క్లిష్టంగా మార్చేశాయి. యువత తమ లైంగిక ప్రాధాన్యాన్ని గుర్తించడంతో సురక్షిత శృంగారం విషయంలో కొన్ని ఆందోళనలు నెలకొన్నాయి.


చాలామంది ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోకుండానే శృంగారంలో పాల్గొనేందుకు మొగ్గుచూపుతారు. ఆ సమయంలో కండోములు ఆనందాన్ని దూరం చేస్తాయన్నది ఒక సాధారణ ఫిర్యాదు.  కండోముల వినియోగానికి సంబంధించి బోల్డన్ని అపోహలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.


కండోమ్స్ ఆనందాన్ని దూరం చేస్తాయి

సాధారణంగా ప్రజల్లో ఒక అపోహ పాతుకుపోయింది. కండోమ్ శృంగారంలోని ఆనందాన్ని దూరం చేస్తుందన్నది వాటిలో ఒకటి. అయితే, కండోములను ధరిస్తూనే ఆనందం పొందడానికి చాలామార్గాలు ఉన్నాయి. కొన్ని కండోములు శృంగారాన్ని అత్యంత ఆనందంగా మారుస్తాయి. ఇవి అత్యంత సన్నని ఫ్లేవర్డ్ కండోములు. ఇవి ధరించినా ధరించనట్టే ఉంటుంది. రక్షణకు రక్షణ, ఆనందానికి ఆనందం. కండోములు ఇష్టపడని వారికి ఇవి చక్కని ఆప్షన్. 

 

శృంగారంలో పాల్గొనే వ్యక్తులను విశ్వసించడం 

చాలామంది శృంగారంలో తమ భాగస్వామిని పూర్తిగా విశ్వసిస్తారు. కాబట్టి కండోముల అవసరం లేదని అనుకుంటారు. అయితే, లైంగికంగా సంక్రమించే అంటువ్యాధుల (ఎస్‌టీఐలు)కు అవతలి వ్యక్తి మంచి చెడులతో సంబంధం ఉండదు. కాబట్టి కండోముల వాడకానికి ఇదొక కారణం మాత్రమే కాదు, బాధ్యత కూడా.


మౌఖిక శృంగారానికి రక్షణ అవసరం లేదు 

సాధారణంగా అందరూ చేసే మరో పొరపాటు ఇది. మౌఖిక శృంగారానికి కండోమ్ అక్కర్లేదనేది చాలామంది భావన. అయితే, భాగస్వామి కూడా అందుకు ఓకే అంటే సరే. లేదంటే అప్పుడు కూడా కండోమ్ అవసరమే. ఎందుకంటే గనేరియా, క్లమిడియా, హెర్పెస్ వంటివి మౌఖిక శృంగారం ద్వారా కూడా సంక్రమించే అవకాశం ఉంది. కాబట్టి మౌఖిక శృంగారంలోనూ కండోమ్ తప్పనిసరి.


కండోములు సులభంగా చినిగిపోతాయి

 సాధారణంగా చాలామంది చేసే ఫిర్యాదు ఇది. కండోములు చాలా సులభంగా చినిగిపోతాయని. శృంగారం మధ్యలో అలా జరుగుతూ ఉంటుందని చాలామంది అంటుంటారు. దీనివల్ల రక్షణ లేకుండా పోవడమే కాకుండా ఉత్సాహం కూడా పోతుందని చెబుతారు. ఇలాంటి ఫిర్యాదులు ఉన్నాయి కాబట్టి కొనేటప్పుడే మంచి నాణ్యమైనవి కొనుగోలు చేయాలి. కండోమును ఉపయోగించేటప్పుడు దాని చివరిలో గాలి బుడగ లేదని నిర్ధారించుకోవాలి. పదునైన గోళ్లు, నగలు, దంతాలు తగలకుండా జాగ్రత్తగా ఉండాలి. కండోమును వేరేవైపు తిప్పడానికి ఎప్పుడూ ప్రయత్నించవద్దు.  


కండోములు రక్త ప్రసరణను నిలిపివేస్తాయా? 

లేదు, కండోముల వల్ల అలా ఎప్పుడూ జరగదు. అవి చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. అయితే, అది చాలా బిగుతుగా ఉంటే మాత్రం చినిగిపోయే ప్రమాదం ఉంది. మరీ లూజుగా ఉంటే లీకయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్త వహించాలి. 

Updated Date - 2022-01-30T01:04:43+05:30 IST