కరోనా మరణాల గురించి కీలక విషయాన్ని వెల్లడించిన డబ్ల్యూహెచ్‌వో

ABN , First Publish Date - 2020-04-02T23:58:52+05:30 IST

యూరప్‌లో కరోనా బారిన పడి మరణించిన వారి గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) కీలక విషయాన్ని...

కరోనా మరణాల గురించి కీలక విషయాన్ని వెల్లడించిన డబ్ల్యూహెచ్‌వో

జెనీవా: యూరప్‌లో కరోనా బారిన పడి మరణించిన వారి గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) కీలక విషయాన్ని వెల్లడించింది. యూరప్‌లో కరోనా సోకి చనిపోయిన వారిలో 95 శాతానికి పైగా 60 సంవత్సరాలు పైబడిన వారేనని డబ్ల్యూహెచ్‌వో స్పష్టం చేసింది. 10 నుంచి 15 శాతం మంది 50 సంవత్సరాల లోపు ఉన్నవారు కరోనా బారిన పడుతున్నారని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది.


అయితే.. డాక్టర్ హన్స్ క్లుజ్ మాట్లాడుతూ... వయసు మీదపడిన వారికే కరోనా సోకుతుందనేది అపోహేనని, ఇందులో వాస్తవం లేదని చెప్పారు. టీనేజ్ వయసున్న వారికి కూడా కరోనా సోకిందని, వారిలో కొందరు ఐసీయూలో చికిత్స పొందుతున్నారని క్లూజ్ చెప్పారు. యూరప్‌లో 30,098 మంది కరోనా బారిన పడి మరణించినట్లు.. ప్రధానంగా ఇటలీ, ఫ్రాన్స్, స్పెయిన్ దేశాల్లో కరోనా మహమ్మారి విజృంభించినట్లు ఆయన తెలిపారు.

Updated Date - 2020-04-02T23:58:52+05:30 IST