చైనాపై డబ్ల్యూహెచ్‌వో ఆధారపడొద్దు: అమెరికా

ABN , First Publish Date - 2020-06-02T07:40:06+05:30 IST

అవినీతి, చైనాపై ఆధారపడడం వంటి చర్యలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) స్వస్తి పలకాలని అమెరికా జాతీయ భద్రత సలహాదారు రాబర్ట్‌ ఓబ్రియన్‌ అన్నారు. ఈ రెండు అంశాల విషయంలో...

చైనాపై డబ్ల్యూహెచ్‌వో ఆధారపడొద్దు: అమెరికా

  • అవినీతికి స్వస్తి పలికితే మళ్లీ ఆ సంస్థలో చేరతాం


వాషింగ్టన్‌, జూన్‌ 1: అవినీతి, చైనాపై ఆధారపడడం వంటి చర్యలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) స్వస్తి పలకాలని అమెరికా జాతీయ భద్రత సలహాదారు రాబర్ట్‌ ఓబ్రియన్‌ అన్నారు. ఈ రెండు అంశాల విషయంలో తాము చెప్పినట్లు చేస్తే డబ్ల్యూహెచ్‌వోలో మళ్లీ చే రే విషయంపై ఆలోచిస్తామని తెలిపారు. డబ్ల్యూహెచ్‌వోలో సంస్కరణలు తీసుకురావాల్సి ఉందని చెప్పారు. చైనా చేతిలో డబ్ల్యూహెచ్‌వో కీలు బొమ్మలా మారిందని ఇటీవలే అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ అన్నారు. 


Updated Date - 2020-06-02T07:40:06+05:30 IST