వరంగల్ ఘటన : నిద్రమాత్రలు అమ్మిందెవరు?

ABN , First Publish Date - 2020-05-28T15:56:38+05:30 IST

గీసుకొండ మండలం గొర్రెకుంట హత్య ఘటనలో 9 మందిని హత్య చేసిన

వరంగల్ ఘటన : నిద్రమాత్రలు అమ్మిందెవరు?

  • షాపులపై డ్రగ్స్‌ అధికారుల ఆరా
  • అప్రమత్తమైన ఔషధ శాఖ

వరంగల్/హన్మకొండ : గీసుకొండ మండలం గొర్రెకుంట హత్య ఘటనలో 9 మందిని హత్య చేసిన నిందితుడికి 60 నిద్ర మాత్రలు ఇచ్చిన విషయం వెలుగులోకి రావడంతో ఔషధ నియంత్రణ శాఖ అప్రమత్తమైంది. ప్రిస్కిప్షన్‌ లేకుండా ఇవ్వడమేమిటనే అంశంపై అంతర్గత విచారణ ప్రారంభమైంది. నగరంలోని పలు మెడికల్‌ ఏజెన్సీలు,  షాపులలో డ్రగ్స్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ శ్రీనివాస్‌, ఇన్‌స్పెక్టర్‌ రఫీ తనిఖీలు చేపట్టారు. స్టాక్‌ పొజీషన్‌ను నిషితంగా పరిశీలించారు.


ఒకే షాపులో విక్రయించారా..? లేక నిందితుడు రెండు మూడు షాపుల్లో కొనుగోలు చేశాడా అన్న కోణంలో విచారణ చేపడుతున్నారు. మరోవైపు డ్రగ్స్‌ అధికారులు మంగళవారమే పోలీసు ఉన్నతధికారులను కలిసి వివరాలు సేకరించారు. అనంతరం గొర్రెకుంట ఘటనా స్థలిలో తనిఖీలు నిర్వహించారు. విచారణ అనంతరం మాత్రలు విక్రయించిన షాపు నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని డ్రగ్స్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ శ్రీనివాస్‌ తెలిపారు.

Updated Date - 2020-05-28T15:56:38+05:30 IST