ఈ వినతులకు బాధ్యులెవరు!

ABN , First Publish Date - 2022-01-25T07:00:05+05:30 IST

కాకినాడ కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం నిర్వహించే ‘స్పందన’ను కొవిడ్‌ ఉధృతి నేపథ్యంలో ఈ వారం రద్దు చేశారు. ఈ విషయాన్ని ఒక్క రోజు ముందు మాత్రమే ప్రసార మాధ్యమాల ద్వారా తెలిపారు.

ఈ వినతులకు బాధ్యులెవరు!

కాకినాడ కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం నిర్వహించే ‘స్పందన’ను కొవిడ్‌ ఉధృతి నేపథ్యంలో ఈ వారం రద్దు చేశారు. ఈ విషయాన్ని ఒక్క రోజు ముందు మాత్రమే ప్రసార మాధ్యమాల ద్వారా తెలిపారు. ఇది తెలియని చాలా మంది అర్జీదారులు యథావిధిగా వినతులు పట్టుకుని కలెక్టరేట్‌కు వచ్చారు. ఇంక చేసేదేముంది. కలెక్టరేట్‌ గేటు బయట ఉంచిన బాక్సులో అర్జీలు వేసి వెనుదిరిగారు. అయితే వీటిని సంబంధిత శాఖలకు చేర్చే విషయంలో ఎవరు బాధ్యత తీసుకుంటారో తమకెలా తెలుస్తుందని అర్జీదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారి అయిన జిల్లా రెవెన్యూ అధికారి సెలవులో ఉన్నారు. తమ అర్జీలకు దిక్కెవరు అంటూ వచ్చిన వారంతా నిరాశతో పయనమయ్యారు.

      ... భానుగుడి (కాకినాడ)




Updated Date - 2022-01-25T07:00:05+05:30 IST