స్వల్పంగా తగ్గిన టోకు ద్రవ్యోల్బణం

ABN , First Publish Date - 2022-01-15T08:27:22+05:30 IST

టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం డిసెంబరు నెలలో 13.56 శాతానికి తగ్గింది. నవంబరు నెలలో ఇది 14.23 శాతం

స్వల్పంగా తగ్గిన టోకు ద్రవ్యోల్బణం

న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం డిసెంబరు నెలలో 13.56 శాతానికి తగ్గింది. నవంబరు నెలలో ఇది 14.23 శాతం  ఉండగా 2020 డిసెంబరులో 1.95 శాతం ఉంది. ఆహార వస్తువుల విభాగంలో ద్రవ్యోల్బణం 23 నెలల గరిష్ఠ స్థాయి 9.56 శాతానికి దూసుకుపోయింది. కూరగాయల ధరలు 31.56 శాతం పెరిగాయి. పప్పులు, గోధుమ, కాయధాన్యాలు, ధాన్యం ధరలు పెరగ్గా బంగాళాదుంప, ఉల్లి, పళ్లు, గుడ్లు, మాంసం, చేపల ధరలు తగ్గాయి. ఖనిజ తైలాలు, మౌలిక లోహాలు, క్రూడ్‌ పెట్రోలియం, సహజ వాయువు, రసాయనాలు, రసాయనిక ఉత్పత్తుల ధరలు కూడా పెరిగినట్టు వాణిజ్య శాఖ గణాంకాలు తెలుపుతున్నాయి. 

Updated Date - 2022-01-15T08:27:22+05:30 IST