Abn logo
Mar 25 2020 @ 09:27AM

చిరు సినిమాకు అనుష్క అందుకే `నో` చెప్పిందా?

మెగాస్టార్ చిరంజీవి సరసన నటించే అవకాశాన్ని వదులుకోవాలని ఏ హీరోయినూ అనుకోదు. ఆయనతో కలిసి నటించే అవకాశం వస్తే ఎగిరి గంతేస్తారు. అయితే మెగాస్టార్ ప్రస్తుతం నటిస్తున్న `ఆచార్య` సినిమాకు సీన్ రివర్స్ అయింది. త్రిష, అనుష్క వంటి సీనియర్ హీరోయిన్లు కూడా `ఆచార్య` అవకాశాన్ని వదులుకున్నారు. 


నిజానికి త్రిష కంటే ముందు ఆనుష్కనే `ఆచార్య` బృందం సంప్రదించిందట. అయితే ఆ సినిమాలో హీరోయిన్‌కు కనీస ప్రాధాన్యం లేదట. పాత్ర నిడివి కూడా చాలా తక్కువట. కొన్ని సీన్లలో డైలాగులు కూడా ఉండవట. అలాంటి పాత్ర చేయడం ఇష్టం లేక అనుష్క ఆ ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించిందట. త్రిష, అనుష్క ఆ ఆఫర్‌ను వదులుకోవడంతో కాజల్ ఆ ఛాన్స్ దక్కించుకుంది. ఈ సినిమా చేస్తున్నందుకు కాజల్ ఏకంగా రూ. 1.5 కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటోందట. 

Advertisement
Advertisement
Advertisement