సీఎం జగన్ ఎందుకు విచారణ నుంచి ముఖం చాటేస్తున్నారు?

ABN , First Publish Date - 2021-12-07T00:49:26+05:30 IST

ఏపీ సీఎం జగన్ వ్యక్తిగత హాజరు మినహాయింపుపై హైకోర్టులో విచారణ జరిగింది. అక్రమాస్తుల కేసులో జగన్ హాజరుకు మినహాయింపు ఇవ్వొద్దని ..

సీఎం జగన్ ఎందుకు విచారణ నుంచి ముఖం చాటేస్తున్నారు?

హైదరాబాద్: ఏపీ సీఎం జగన్ వ్యక్తిగత హాజరు మినహాయింపుపై హైకోర్టులో విచారణ జరిగింది. అక్రమాస్తుల కేసులో జగన్ హాజరుకు మినహాయింపు ఇవ్వొద్దని సీబీఐ కోరింది. సాక్ష్యాలను జగన్ తారుమారు చేసే అవకాశముందని సీబీఐ వాదించింది. సాక్షులను ప్రభావితం చేస్తారనే ఉద్దశంతోనే గతంలో హాజరు మినహాయింపునకు హైకోర్టు నిరాకరించిందని సీబీఐ పేర్కొంది. జగన్ హోదా పెరిగినందున సాక్షులను మరింత ప్రభావితం చేసే అవకాశం ఉందని సీబీఐ వాదించింది. పదేళ్లైనా కేసులు డిశ్చార్జ్ పిటిషన్ల దశలోనే ఉన్నాయని, హాజరు మినహాయింపు ఇస్తే విచారణ మరింత జాప్యం అవుతుందని సీబీఐ స్పష్టం చేసింది. దీంతో జగన్ హాజరు మినహాయింపుపై తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది.


ఈ నేపథ్యంలో ‘‘జగన్ మినహాయింపు వాదనలకు సీబీఐ కౌంటర్ ఆర్గుమెంట్ ఏంటి?. జగన్ రిక్వెస్ట్‌ను గతంలో నిరాకరించిన హైకోర్టు ఈసారి ఏమంటుంది?. పదేళ్లు దాటినా ఇంకా ముందుకు సాగని విచారణ ఎన్నేళ్లు సాగేనో?. అసలు జగన్ ఎందుకు విచారణ నుంచి ముఖం చాటేస్తున్నారు?. అక్రమాస్తుల కేసుల విచారణ నుంచి జగన్ మినహాయింపు ఎందుకు కోరుకుంటున్నారు?.’’ అనే అంశాలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్ నిర్వహించింది. ఈ వీడియోను చూడగలరు. 

Updated Date - 2021-12-07T00:49:26+05:30 IST