పిల్లల్లో కరోనా ఎందుకు పెరుగుతోందంటే..

ABN , First Publish Date - 2021-04-21T07:46:05+05:30 IST

కరోనా మొదటి వేవ్‌తో పోలిస్తే రెండో వేవ్‌లో పిల్లలకు ఇన్ఫెక్షన్లు సోకే రేటు పెరిగింది. అతిసారం, వాంతులు, చర్మంపై దద్దుర్లు, కంటి ఇన్ఫెక్షన్‌, రక్తనాళాల్లో వాపు, జ్వరం, ఎడతెరిపి లేని దగ్గు లక్షణాలు కలిగిన పలువురు పిల్లలకు...

పిల్లల్లో కరోనా ఎందుకు పెరుగుతోందంటే..

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 20: కరోనా మొదటి వేవ్‌తో పోలిస్తే రెండో వేవ్‌లో పిల్లలకు ఇన్ఫెక్షన్లు సోకే రేటు పెరిగింది. అతిసారం, వాంతులు, చర్మంపై దద్దుర్లు, కంటి ఇన్ఫెక్షన్‌, రక్తనాళాల్లో వాపు, జ్వరం, ఎడతెరిపి లేని దగ్గు లక్షణాలు కలిగిన పలువురు పిల్లలకు కొవిడ్‌ ‘పాజిటివ్‌’ నిర్ధారణ అవుతోందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రధానంగా 5 నుంచి 12 ఏళ్లలోపు పిల్లలపై ఇన్ఫెక్షన్‌ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోందని అంటున్నారు. గత వారం వ్యవధిలోనే ఢిల్లీలోని ఓ ప్రైవేటు పిల్లల ఆస్పత్రిలో ఈ తరహా 50 కేసులు నమోదయ్యాయి. ఇటీవల కొంతమంది నవజాత శిశువులకు కూడా ‘పాజిటివ్‌’ నిర్ధారణ అయిందని వైద్య నిపుణులు పేర్కొన్నారు. కరోనా వేగంగా వ్యాపిస్తున్న ప్రస్తుత తరుణంలో జనం రద్దీ బాగా ఉండే ప్రదేశాలకు పిల్లలను తీసుకెళ్లకపోవడం శ్రేయస్కరమని సూచిస్తున్నారు. పెద్దలు బహిరంగ ప్రదేశాలకు వెళ్లి, ఇళ్లలోకి వచ్చాక చేతులను శానిటైజ్‌ చేసుకోవడం, స్నానం చేయడం వంటి కనీసం జాగ్రత్త చర్యలను పాటించాలని కోరుతున్నారు. ఈవిషయాల్లో తల్లిదండ్రుల నిర్లక్ష్యం వల్లే పిల్లలకు ఇన్ఫెక్షన్‌ సోకుతోందని చెప్పారు.


Updated Date - 2021-04-21T07:46:05+05:30 IST