క్యాప్సూల్స్‌ని పరిశీలనగా ఎప్పుడైనా చూశారా? రెండు రంగులలో ఎందుకు ఉంటాయి? దీని వెనుకగల కారణం తెలిస్తే..

ABN , First Publish Date - 2022-01-06T13:17:40+05:30 IST

ఎవరైనా అనారోగ్యానికి గురైతే..

క్యాప్సూల్స్‌ని పరిశీలనగా ఎప్పుడైనా చూశారా? రెండు రంగులలో ఎందుకు ఉంటాయి? దీని వెనుకగల కారణం తెలిస్తే..

ట్యాబ్లెట్ల మీద అడ్డ గీతలు ఎందుకు ఉంటాయనే విషయాన్ని (https://www.andhrajyothy.com/telugunews/why-do-medical-tablets-have-a-split-line-in-the-middle-spl-mrgs-prathyekam-1922010310343264) ఇటీవలే తెలుసుకుని ఉంటారు. ఇప్పుడు క్యాప్సూల్స్‌‌కు సంబంధించి మీరు ఎప్పుడూ వినని ఆసక్తకర విషయాలను తెలుసుకుందాం.

ఎవరైనా అనారోగ్యానికి గురైతే.. వైద్యులు మందులు రాస్తారు. ఇవి మాత్రలు, సిరప్‌లు, క్యాప్సూల్స్, ఇంజెక్షన్ల రూపంలో ఉంటాయనే విషయం అందరికీ తెలిసిందే. అయితే క్యాప్సూల్స్ రెండు రంగులలో ఉండటాన్ని మీరు గమనించే ఉంటారు. ఇది డిజైన్ కాదు... క్యాప్సూల్‌ అందంగా కనిపించేందుకు చేసిన ప్రక్రియ అంతకన్నాకాదు. అయితే మరి.. దాని వెనుకగల  కారణం ఏమిటనే సందేహం మీలో వ్యక్తమయ్యే ఉంటుంది. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

క్యాప్సూల్స్‌ రంగుల గురించి తెలుసుకోవాలంటే ముందుగా వాటిని ఎలా తయారు చేస్తారో తెలుసుకోవాలి. క్యాప్సూల్స్ తయారు చేయడానికి జెలటిన్, సెల్యులోజ్ రెండింటినీ ఉపయోగిస్తారు. వాటి లోపల ఔషధాన్ని నింపుతారు. అయితే కొన్ని దేశాల్లో, ఆరోగ్య ప్రయోజనాల దృష్ట్యా జెలటిన్‌తో క్యాప్సూల్స్‌ను తయారు చేయడంపై నిషేధం అమలులో ఉంది. మనదేశంలోనూ జెలటిన్‌కు బదులుగా సెల్యులోజ్‌తో క్యాప్సూల్స్‌ను తయారు చేయాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. క్యాప్సూల్ రెండు భాగాలను కలిగి ఉంటుంది. రెండూ వేర్వేరు రంగులలో ఉంటాయి.


క్యాప్సూల్‌లో ఒక భాగం క్యాప్ అయితే..మరొక భాగం కంటైనర్. క్యాప్సూల్‌లోని కంటైనర్ భాగంలో ఔషధం ఉంటుంది. దానిలోని మరో భాగం క్యాప్ మాదిరిగా ఉపయోగపడుతుంది. క్యాప్సూల్‌ను ఓపెన్ చేయడం ద్వారా దీనిని గమనించవచ్చు. ఔషధ తయారీ కంపెనీలో పనిచేసే ఉద్యోగులు క్యాప్సూల్స్ తయారు చేసేటప్పుడు పొరపాట్లు జరగకుండా ఉండేందుకు క్యాప్సూల్ క్యాప్, కంటెయినర్ కలర్ వేర్వేరుగా ఉంచుతారు. క్యాప్సూల్‌లో ఏ భాగంలో కంటైనర్ ఉందో, క్యాప్ ఏదన్నదీ వారు గుర్తుంచుకుంటారు. క్యాప్సూల్ క్యాప్, కంటైనర్ రంగులను వేర్వేరుగా ఉంచాల్సివస్తుండటంతో ఫార్మాస్యూటికల్ కంపెనీలు క్యాప్సూల్ ధరను పెంచాల్సివస్తుంది. 



Updated Date - 2022-01-06T13:17:40+05:30 IST