Jun 15 2021 @ 17:32PM

మమ్మల్ని ఎందుకు ఇండియన్స్‌లా చూడరు: నటి

మమ్మల్ని ఎందుకు ఇండియన్స్‌లా చూడరు అంటున్నారు లిన్ లైష్రామ్. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ప్రధాన పాత్ర పోషించగా 2014లో వచ్చి సూపర్ హిట్ అయిన బయోపిక్ 'మేరీకోమ్‌'. భారతీయ బాక్సర్‌ మేరీకోమ్‌ జీవితం ఆధారంగా తెరకెక్కించిన ఇందులో ప్రియాంక చోప్రా టైటిల్ పాత్రలో నటించగా, లిన్ లైష్రామ్ కీలక పాత్రలో కనిపించారు. ఈ సినిమా కోసం ప్రియాంక చాలా కష్టపడింది. అయితే ఈ పాత్రలో తనకంటే మణిపూర్‌కి చెందిన అమ్మాయిలు నటిస్తే పాత్రకి సరైన న్యాయం జరిగుండేదని అభిప్రాయపడింది లిన్. ఈ సినిమా కాస్టింగ్ విషయంలో వివక్షత చూపించారని అన్నారు. ఈశాన్యరాష్ట్రాల వారిని ఇందులో నటింపజేస్తే ఇక్కడి ప్రజల టాలెంట్‌ని ఎంకరేజ్ చేసినట్లుండేదని, అన్న ఆమె ఈశాన్య రాష్ట్రాల వారికి ఎందుకు అవకాశం ఇవ్వడం లేదు..వారు ఇండియన్స్ కాదా.. అని ప్రశ్నించారు. కాగా లిన్ మేరీకోమ్‌ సినిమాతో పాటు 'ఓం శాంతి ఓం', 'ఉమ్రికా', 'రంగూన్‌'లలో నటించారు. ఇక మేరీకోమ్‌ సినిమాలో ఒక సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి బాక్సర్‌గా ఎదిగి 5 వరల్డ్ చాంపియన్స్ గెలుచుకున్న విధానాన్ని అద్భుతంగా చూపించారు. సంజయ్ లీలా భన్సాలీ నిర్మాణంలో ఓమంగ్ కుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.