రేవంత్‌ అంటే ఎందుకు భయం?

ABN , First Publish Date - 2020-05-28T10:50:37+05:30 IST

కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెం ట్‌, మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌రెడ్డి నిర్మల్‌కు వచ్చి రైతులను కలిస్తే రైతుల

రేవంత్‌ అంటే ఎందుకు భయం?

పర్యటనను అడ్డుకోవడం పిరికిపందచర్య 

మాజీ ఎమ్మెల్యే ఏలేటి  ధ్వజం


నిర్మల్‌, మే 27(ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్‌  ప్రెసిడెం ట్‌, మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌రెడ్డి నిర్మల్‌కు వచ్చి రైతులను కలిస్తే రైతుల నుంచి చేసే దోపిడీ బయట పడుతుందని, ఆయన రాకకు అనుమతినివ్వలేదని మాజీఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ రైతుల నుంచి పది శాతం ధాన్యం దోపిడీ చేస్తున్నారని, అధికార పార్టీ కుంభకోణాలు బయటపడతాయన్న భయంతో రేవంత్‌ పర్యటనను పోలీసులతో అడ్డుకున్నారని, అనుమతి నిరాకరించారన్నారు. నిర్మల్‌లో వెయ్యి మందితో దివ్యాగార్డెన్‌లో సమావేశం ఏర్పాటు చేసిన మంత్రిపై ఎందుకు కేసులు నమోదు చేయలేదని ప్రశ్నించారు. ప్రతినిత్యం వందలాది మందితో సమావేశమైనా పట్టించుకోవడం లేదన్నారు.


గ్రీన్‌జోన్‌గా మారినప్పుడు అంతమందితో సమావేశం ఎలా నిర్వహిస్తారన్నారు. భౌతికదూరం పాటించకపోవడం, మాస్క్‌లు ధరించకపోవడంతో పాటు అనేక నిబంధనలు మంత్రి ఉల్లంఘించారన్నా రు. అధికార పార్టీ నేతలకు ఒకచట్టం, ఇతర పార్టీలకు మరో చట్టం ఉందా? అని నిలదీశారు. ప్రజాస్వామ్య పద్ధతిలో తమ పోరాటం కొనసాగిస్తామన్నారు. అధికార పార్టీ అణిచివేత చర్యలకు భయపడమని, న్యాయ పోరాటం చేస్తామన్నారు. సమావేశంలో పరిగి మాజీ ఎమ్మెల్యే రాంమోహన్‌రెడ్డి, కాంగ్రెస్‌ నాయకులు సరికెల గంగన్న, నాందేడపు చిన్ను, జమాల్‌, జునైద్‌, బీడీ కంపెనీ రమేష్‌, జింక సూరి, సబాకలీం, కూన శివకుమార్‌, ఏ.పోశెట్టి, సత్యం చంద్రకాంత్‌, శంకర్‌పతి, అజహర్‌, కౌన్సిలర్‌ ఇమ్రానుల్లాఖాన్‌లున్నారు.

Updated Date - 2020-05-28T10:50:37+05:30 IST