స్టార్ హీరోల కుమారులను పరిచయం చేయడం అంత సామాన్యమైన విషయం కాదనేది అందరికీ తెలిసిందే. చాలా రిస్క్‌తో కూడుకున్న వ్యవహారం. వారిపై అంచనాలను పెట్టుకుంటారు ఫ్యామిలీ మెంబర్స్ అలాగే అభిమానులు. అందుకే రామ్ చరణ్‌ని తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయం చేసే విషయంలో దర్శకధీరుడు రాజమౌళి భయపడ్డారట. ఈ విషయం స్వయంగా రాజమౌళినే తెలిపాడు.
‘‘రామ్ చరణ్‌ని టాలీవుడ్‌కి పరిచయం చేయాలని ముందు నాకే చిరంజీవిగారు ఆఫర్ ఇచ్చారు. కానీ చాలా భయపడిపోయాను. చేయలేను అని చెప్పేశాను. కారణం అతనిలోని ప్లస్‌లు, మైనస్‌లు నాకు తెలియవు. అతను ఫైట్స్ ఎలా చేస్తాడో, డ్యాన్స్ ఎలా చేస్తాడో, ఎమోషన్స్ ఎలా పండిస్తాడో.. అనే విషయాలు తెలియవు. అదీకాక చిరంజీవిగారి అబ్బాయి. అంచనాలు మాములుగా ఉండవు. అందుకే రామ్‌చరణ్‌ని పరిచయం చేసే ఛాన్స్ తీసుకోలేదు..’’ అని ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో రాజమౌళి చెప్పుకొచ్చారు.
ఇక పూరి జగన్ ఆ బాధ్యతను తీసుకోవడమే కాకుండా గ్రాండ్‌గా చరణ్‌ని ‘చిరుత’తో పరిచయం చేశాడు. ఆ సినిమా తర్వాత రాజమౌళి చరణ్‌ని ‘మగధీర’గా ఏ రేంజ్లో ప్రజంట్ చేశారో అందరికీ తెలిసిందే. ‘మగధీర’ తర్వాత మళ్లీ రామ్ చరణ్‌ని రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ చిత్రమే. ఈ చిత్రంలో మరో స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్నారు.