ఫోను రీఛార్జ్ ప్యాక్ వ్యాలిడిటీ.. 30 రోజులకు బదులు 28 రోజులే ఎందుకు ఉంటుంది? ఫలితంగా మీరేం నష్టపోతున్నారో తెలిస్తే..

ABN , First Publish Date - 2021-12-23T15:17:54+05:30 IST

గత నవంబర్ తరువాత చాలా టెలికాం కంపెనీలు..

ఫోను రీఛార్జ్ ప్యాక్ వ్యాలిడిటీ.. 30 రోజులకు బదులు 28 రోజులే ఎందుకు ఉంటుంది? ఫలితంగా మీరేం నష్టపోతున్నారో తెలిస్తే..

గత నవంబర్ తరువాత చాలా టెలికాం కంపెనీలు తమ రీఛార్జ్ ప్యాక్‌ల ధరలను పెంచాయి. ఫలితంగా వినియోగదారులపై చార్జీల భారం పెరిగింది. దీంతో రీఛార్జ్ ప్లానింగ్ ఖరీదైన వ్యవహారంగా మారింది. అయితే ప్లాన్ చెల్లుబాటు (28 రోజుల ప్లాన్ వాలిడిటీ)కు సంబంధించి ఏ కంపెనీ కూడా ఎటువంటి మార్పులను చేయలేదు. వినియోగదారుల తాము నెలవారీ రీఛార్జ్ ప్లాన్‌ను ఎంచుకోవాలంటే.. వారు 30 లేదా 31 రోజులకు బదులుగా 28 రోజుల చెల్లుబాటు గల ప్లాన్‌ను మాత్రమే అందుకోగలుగుతారు. టెలికాం కంపెనీల ద్వారా నెలవారీ రీఛార్జ్ ప్లాన్ 28 రోజులు మాత్రమే ఎందుకు ఉంటుందో తెలుసా? Airtel, Voda-Idea, Jio తదిత టెలికాం కంపెనీలు తమ నెలవారీ రీఛార్జ్ ప్యాక్‌లను 30 రోజులకు బదులుగా 28 రోజుల చెల్లుబాటుతో ఎందుకు అందిస్తాయోనని ఎప్పుడైనా ఆలోచించారా? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.


టెలికాం కంపెనీలు తమ కస్టమర్లకు 30 రోజుల పాటు ఛార్జీలు విధించి, 28 రోజుల చెల్లుబాటును మాత్రమే అందిస్తాయి. ఈ విధంగా వినియోగదారుడు ఏడాది పాటు రీఛార్జ్ చేయించుకుంటే సదరు టెలికం కంపెనీ వినియోగదారుని నుంచి ఒక నెల రీఛార్జ్ సొమ్మును ఉచితంగా అందుకుంటుంది. నెల రోజుల రీఛార్జ్‌ విధానాన్ని జియో కంపెనీ 28 రోజుల చెల్లుబాటుతో ప్రారంభించింది. ఆ తరువాత ఇతర కంపెనీలు కూడా ఇదేవిధమైన వ్యాలిడిటీతో తమ ప్లాన్‌లను అందించడం మొదలుపెట్టాయి. గతంలో టెలికం కంపెనీలు 30 రోజుల చెల్లుబాటుతో నెలవారీ రీఛార్జ్ ప్యాక్‌లను అందించేవి. ఈ 28 రోజుల వ్యాలిడిటీ ప్లాన్ వెనుక మార్కెటింగ్ వ్యూహం ఉంది. సంవత్సరానికి 12 నెలలు ఉంటాయి. అయితే 28 రోజుల లెక్కన చూసుకుంటే 13 నెలలు వస్తాయి. ఫలితంగా టెలికం కంపెనీలు ఒక నెల లాభాన్ని పొందుతాయి. మార్కెటింగ్ లెక్కల ప్రకారం ప్రతి నెలను 28 రోజులుగా పరిగణిస్తే, సంవత్సరానికి 13 నెలలు వస్తాయి. 28×13=365 రోజులు.. అంటే సంవత్సరానికి సమానం అవుతుందని కూడా అర్థం చేసుకోవచ్చు. 

Updated Date - 2021-12-23T15:17:54+05:30 IST