‘వైట్‌ హౌస్‘ను ‘దయ్యాల కొంప’ అని ఎందుకంటారంటే...

ABN , First Publish Date - 2020-02-22T13:29:58+05:30 IST

అమెరికా అధ్యక్షుని నివాస స్థానం ‘వైట్ హౌస్’ అనే విషయం అందరికీ తెలిసిందే. అయితే వైట్ హౌస్ గురించిన కొన్ని విషయాలు చాలమందికి తెలియదు. వైట్ హౌస్‌ను దయ్యాల కొంప అని, అక్కడ ఆత్మలు తిరుగుతుంటాయని...

‘వైట్‌ హౌస్‘ను ‘దయ్యాల కొంప’ అని ఎందుకంటారంటే...

న్యూయార్క్: అమెరికా అధ్యక్షుని నివాస స్థానం ‘వైట్ హౌస్’ అనే విషయం అందరికీ తెలిసిందే. అయితే వైట్ హౌస్ గురించిన కొన్ని విషయాలు చాలమందికి తెలియదు. వైట్ హౌస్‌ను దయ్యాల కొంప అని, అక్కడ ఆత్మలు తిరుగుతుంటాయని పలువురు చెబుతుంటారు. వైట్ హౌస్‌ నిర్మాణం 1792-1800 మధ్య కాలంలో జరిగింది. అమెరికా ఆర్కిటెక్ట్ జేమ్స్ హోబన్ దీనికి డిజైన్ చేశారు. వైట్ హౌస్‌లో మొత్తం 132 గదులు, 412 తలుపులు, 147 కిటికీలు, 35 బాత్రూములు, మూడు లిఫ్టులు ఉన్నాయి. అమెరికా రాజకీయ చరిత్రలో వైట్ హౌస్‌కు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అయితే ఒకానొక సమయంలో దీనిని ఆత్మల ఆవాసంగా భావించేవారు. ఈ అంశం గురించి రెండేళ్ల క్రితం అమెరికాకు చెందిన రచయిత జెన్నా బుష్ హ్యాగెట్ ప్రస్తావించారు. వైట్ హౌస్‌లోని వంట గదిలో 140కి మించిన అతిథులకు వంట చేస్తారు. రాత్రి వేళలో ఒక్కోసారి ఉన్నట్టుండి అరుపులతో పాటు పురాతన కాలంనాటి  పియానో శబ్ధాలు వినిపిస్తుంటాయని తెలిపారు. కాగా అమెరికా 33వ అధ్యక్షుడు హెర్రీ టర్మన్ కూడా గతంలో వైట్ హస్‌లో భూతాలు ఉన్నాయనే అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఆయన తన భార్యకు లేఖ రాస్తూ ‘నేను వైట్ హౌస్‌లోని ఒక గదిలో ఉన్నాను. తెల్లవారు జామున 4 గంటల సమయంలో నేనున్న గది తలుపును ఎవరో మూడుసార్లు కొట్టారు. నేను వెళ్లి తలుపు తీసి చూడగా అక్కడ ఎవరూ కనిపించలేదు. నాకెంతో భయం వేసింది’ అని పేర్కొన్నారు. అదేవిధంగా ఈ వైట్ హౌస్‌లో అమెరికా మాజీ అధ్యక్షుడు, దివంగత అబ్రహం లింకన్ ఆత్మ తిరుగుతుంటుందని చెబుతుంటారు. అమెరికాకు 16వ అధ్యక్షునిగా వ్యవహరించిన అబ్రహం లింకన్‌ను 1865 ఏప్రిల్ 15న తుపాకీతో కాల్చి చంపారు. అతని కుమారుడు విల్లీ లింకన్ కూడా 1862 ఫిబ్రవరి 20న వైట్ హౌస్‌లోనే హత్యకు గురయ్యారు. 


Updated Date - 2020-02-22T13:29:58+05:30 IST