ఇంకానా దాపరికం!

ABN , First Publish Date - 2021-05-13T05:51:01+05:30 IST

ఆక్సిజన్‌ కొరతతో సోమవారం రాత్రి రుయాస్పత్రిలో మృతి చెందిన వారి వివరాలను అధికార యంత్రాంగం ఇప్పటివరకు వెల్లడించలేదు. ఘటన జరిగి 48 గంటలు దాటుతున్నా మృతుల వివరాలను ప్రకటించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది

ఇంకానా దాపరికం!
రుయా ఘటనలో మృతులకు చిత్తూరులో టీడీపీ నేతల నివాళులు

రుయాస్పత్రి ఘటనలో మృతులెందరు? 

ఆంధ్రజ్యోతిలో వచ్చిన జాబితాను ఆర్డీవోకు అందజేసిన బీజేపీ

23మంది చనిపోయారంటున్న సీపీఐ నేత నారాయణ

మృతులందరికీ న్యాయం చేయాలంటూ టీడీపీ డిమాండ్‌

  

తిరుపతి(ఆంధ్రజ్యోతి): ఆక్సిజన్‌ కొరతతో సోమవారం రాత్రి రుయాస్పత్రిలో మృతి చెందిన వారి వివరాలను అధికార యంత్రాంగం ఇప్పటివరకు వెల్లడించలేదు. ఘటన జరిగి 48 గంటలు దాటుతున్నా మృతుల వివరాలను ప్రకటించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఆక్సిజన్‌ కొరతతో 11మంది చనిపోయారని కలెక్టర్‌ ప్రకటించారు. ఈ సంఖ్యపై పెద్దఎత్తున దుమారం రేగుతోంది. కలెక్టర్‌ చెప్పిన 11 మందే కాకుండా మరింతమంది కూడా మరణించినట్టు డెత్‌ డిక్లరేషన్లు వెల్లడిస్తున్నాయని సమాచారం. ‘ఆంధ్రజ్యోతి’ ఆ 11మంది వివరాలతో పాటు మృతుల జాబితాలో చేర్చాలనుకుంటున్న మరో 8 మంది పేర్లను బుధవారం ప్రచురించిన విషయం తెలిసిందే. ఇదే జాబితాతో పాటు రుయా డెత్‌ రికార్డుల్లో టైమును తారుమారు చేసిన కాపీలను బీజేపీ నాయకులు సోమవారం ఆర్డీవోకు అందజేశారు.


రుయా దుర్ఘటనలో 23 మంది చనిపోయారంటూ వారి పేర్లతో సహా బుధవారం సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రికార్డులను బయటపెట్టాలని విపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ఇవన్నీ ప్రభుత్వ హత్యలే అని నారాయణ, టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. అందరికీ న్యాయం చేయాలంటున్నారు. మృతుల ఆత్మకు శాంతి కలగాలంటూ టీడీపీ, కాంగ్రెస్‌ నాయకులు బుధవారం సాయంత్రం కొవ్వొత్తులతో నివాళులు అర్పించారు. 




వివరాలు సేకరించిన విచారణ కమిటీ

రుయా ఘటనపై శాఖాపరమైన విచారణ కమిటీని డీఎంఈ నియమించింది. రుయా మాజీ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ సిద్దానాయక్‌, ఆప్తామాలజీ ప్రొఫెసర్‌ డాక్టర్‌ జమున, ఎస్వీ మెడికల్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ జయాభాస్కర్‌ విచారణ కమిటీ సభ్యులుగా ఉన్నారు. బుధవారం కమిటీ సభ్యులు ఘటన జరిగిన సమయంలో విధుల్లో వున్న నర్సులను విచారించారు. 



డీఎంఈకి నివేదిక పంపాం: డాక్టర్‌ భారతి, రుయా సూపరింటెండెంట్‌

రుయా ఘటనపై డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ (డీఎంఈ) వివరణ అడిగింది. ఆ రోజు ఏమి జరిగిందో, అంతమంది చనిపోవడానికి కారణాలేమిటో వివరిస్తూ డీఎంఈకి నివేదిక పంపాం. మృతుల వివరాలను కూడా ఆ రోజే ప్రభుత్వానికి అందించాం. 


ఆక్సిజన్‌ కొరతతో మృతి చెందినవారు వీరేనంటూ అమరావతిలో బుధవారం టీడీపీ విడుదల చేసిన జాబితా 

-------------------------------------------------------

       పేరు                       ఊరు 

---------------------------------------------------------

1, డి.షాహిత్‌(27)                  సత్యవేడు 

2, ఎస్‌.కె.మహ్మద్‌ బాషా(49)       తిరుపతి 

3, ఒ. జయచంద్ర                   తిరుపతి

4, కె.బాబు(55)                    తిరుపతి

5, టి.రమేష్‌బాబు(39)              తిరుపతి 

6, ఎ.ఆదిలక్ష్మి(35)                 శ్రీకాళహస్తి 

7, జి.వాణి                         తిరుపతి 

8, కె.సరోజమ్మ                    శ్రీకాళహస్తి

9, సి.తనూజరాణి(48)             శ్రీకాళహస్తి 

10, పి. గౌష్‌బాషా(37)             పుంగనూరు

11, ఎస్‌.ఫజుల్లా(41)             పీలేరు 

12, బి.ఎస్‌.మునీర్‌సాహెబ్‌(49)     పుంగనూరు 

13, పి.సుధాకర్‌(42)              మదనపల్లె 

14, బీ గజేంద్రబాబు(36)          పుంగనూరు

15, బి. సులోచన(52)              పీలేరు 

16, వై.వేణుగోపాల్‌(55)            మదనపల్లె

17, రమణాచారి(40)              పీలేరు 

18, ఎస్‌.కె. కల్దార్‌(48)             కోడూరు

19, ఎం.పార్వతమ్మ(60)           పుంగనూరు 

20, నారాయణ తల్లూరు(55)        రాయచోటి 

21, ఎ.సుబ్బయ్య(67)             రాజంపేట

22, ఆవుల వెంకటసుబ్బయ్య(29)   రాజంపేట

23, బి.దేవేంద్రరెడ్డి(60)            చంద్రగిరి 

24, జి.భువనేశ్వర బాబు(36)        చిత్తూరు 

25, ఎన్‌.ప్రభాకర్‌                 చంద్రగిరి

26, పి.ఎస్‌.రామారావు            చంద్రగిరి 

27,సి.మదన్‌మోహన్‌రెడ్డి(52)     చిత్తూరు

28, ఎన్‌.శివప్రియ(33)           చిత్తూరు

29, ఎం.మోహన్‌దాస్‌             నగరి

30, కె.దూర్వాసులు(34)           చంద్రగిరి

31, ఎం.రాజమ్మ                 వెంకటగిరి 


Updated Date - 2021-05-13T05:51:01+05:30 IST