విస్తారంగా వానలు

ABN , First Publish Date - 2020-08-11T10:40:20+05:30 IST

అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం అర్ధరాత్రి నుంచి ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని వనపర్తి, నాగర్‌కర్నూల్‌, వనపర్తి

విస్తారంగా వానలు

ఆదివారం అర్ధరాత్రి నుంచి కురుస్తున్న వర్షాలు

పలు జిల్లాలను కమ్మేసిన ముసురు


నారాయణపేట/నాగర్‌కర్నూల్‌ టౌన్‌/కొల్లాపూర్‌/దేవరకద్ర/వనపర్తి (కలెక్టరేట్‌), ఆగస్టు 10 : అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం అర్ధరాత్రి నుంచి ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని వనపర్తి, నాగర్‌కర్నూల్‌, వనపర్తి, మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. దీంతో చెరువులు, కుంటలు నిండిపోయాయి.


ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం తెల్లవారుజాము వరకు నాగర్‌కర్నూల్‌ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు ముసురు కమ్మేసింది. జిల్లా సగటు వర్షపాతం 29.9 మిల్లీమీటర్లు నమోదు కాగా, అచ్చంపేట మండలంలో అత్యధికంగా 61.8 మి.మీ., తిమ్మాజిపేట మండలంలో 7.8 మి.మీ., తెల్కపల్లిలో మండలంలో 52.7 మి.మీ., కొల్లాపూర్‌లో 57.6, నాగర్‌కర్నూల్‌లో 48.6, తాడూరులో 48.5, పదరలో 44.7, లింగాలలో 32.1 మి.మీ. వర్షపాతం నమోదైంది. కాగా, సోమశిల కృష్ణానదికి వరద ఉధృతి పెరగడంతో కేఎల్‌ఐ ప్రాజెక్టు మొదటి లిఫ్టు ద్వారా సాగునీటిని విడుదల చేశారు. ఎల్లూరు, సింగోటం రిజర్వాయర్లు నిండుకుండలా దర్శనమిస్తున్నాయి.


మహబూబ్‌నగర్‌ జిల్లా దేవరకద్ర మండల కేంద్రంతో పాటు వివిధ అన్ని గ్రామాల్లో ఆదివారం రాత్రి నుంచి వర్షం కురిసింది. మొత్తం మండలంల 57 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.


నారాయణపేట జిల్లా వ్యాప్తంగా ఆదివారం రాత్రి ఓ మోస్తారు వర్షం కురిసింది. జిల్లా వ్యాప్తంగా అత్యధికంగా ధన్వాడ మండలంలో 24.0 మి.మీ., అతి స్వల్పంగా ఊట్కూర్‌ మండలంలో 1.0 మి.మీ. వర్షపాతం నమోదైంది. నారాయణపేటలో 13.0 మి.మీ., దామరగిద్దలో 18.0 మి.మీ., మాగనూర్‌లో 7.4 మి.మీ., నర్వలో 17.2 మి.మీ., మక్తల్‌లో 7.0 మి.మీ., కృష్ణలో 8.0 మి.మీ., మద్దూర్‌లో 9.6 మి.మీ., కోస్గిలో 13.9 మి.మీ., వర్షం కురిసింది.


వనపర్తి జిల్లా వ్యాప్తంగా సోమవారం విస్తారంగా వానలు పడ్డాయి. అత్యధికంగా పెద్దమందడి మండలంలో 6.8 మి.మీ., వనపర్తి మండలంలో 57.0 మి.మీ., గోపాల్‌పేటలో 53.8, ఘనపూర్‌ 53.8, పాన్‌గల్‌ 46.3, కొత్తకోట 40.3, మదనాపురం 35.3, రేవల్లి 29.5, పెబ్బేరు 20.5 మి.మీ. వర్షపాతం నమోదైంది.

Updated Date - 2020-08-11T10:40:20+05:30 IST