Advertisement
Advertisement
Abn logo
Advertisement

నెల క్రితం భర్త మృతి.. పక్కింటి వ్యక్తితో రెండో పెళ్లికి ఆ 26 ఏళ్ల భార్య సిద్ధమైన తర్వాత ఊహించని ఘటన..!

అహ్మదాబాద్: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన ఓ 26ఏళ్ల మహిళ నెల క్రితమే తన భర్తను కోల్పోయింది. ఈ క్రమంలోనే పక్కనే ఉన్న ఓ వ్యక్తికి దగ్గరైంది. తన ఇద్దరు పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని, ఇష్టమైన వాడిని పెళ్లి చేసుకోవాలని భావించింది. తన మనసులోని మాటను కుటుంబ సభ్యులకు చెప్పింది. అనంతరం ఈ విషయం పోలీస్ స్టేషన్‌కు చేరింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. 


అహ్మదాబాద్‌‌కు చెందిన షాబానో పఠాన్ అనే మహిళకు చిన్న వయసులోనే మునవర్ ఖాన్ పఠాన్ అనే వ్యక్తితో పెళ్లైంది. ఈ క్రమంలోనే వారికి ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. అయితే కొద్ది రోజులుగా ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతున్న మునవర్ నెల క్రితం ప్రాణాలు విడిచాడు. దీంతో 26 ఏళ్లకే షాబానో పఠాన్.. భర్తను కోల్పోయింది. ఈ క్రమంలోనే ఆమె తన ఇంటి పక్కనే ఉండే సయ్యద్ అనే వ్యక్తికి దగ్గరైంది. ఆయన కూడా షాబానో పఠాన్‌ను ఇష్టపడుతుండటంతో.. పిల్లల భవిష్యత్తు కోసం తనను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఇదే విషయాన్ని షాబానో పఠాన్ తన పుట్టింటి వారికి చెప్పింది. విషయం తెలుసుకున్న ఆమె సోదరులు షాబానోపై ఆగ్రహం వ్యక్తం చేశారు.


 సయ్యద్ అంటే తమకు ఇష్టం లేదని.. అతడిని పెళ్లి చేసుకుంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. అయితే.. షాబానో పఠాన్ మాత్రం వెనక్కి తగ్గలేదు. దీంతో తాజాగా వివాహం విషయం మాట్లాడేందుకు షాబానో పఠాన్ ఇంటికి ఆమె సోదరులు చేరుకున్నారు. సయ్యద్‌ను కూడా అక్కడకు పిలిపించి.. వివాహం తమకు ఇష్టం లేదని తేల్చి చెప్పారు. అంతేకాకుండా సయ్యద్‌పై చెయ్యి చేసుకున్నారు. దీంతో షాబానో పఠాన్ దాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో ఆమె సోదరులు.. షాబానో పఠాన్‌‌ను కూడా చితకబాదారు. దీంతో సోదరుల ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేసిన షాబానో పఠాన్ పోలీసులను ఆశ్రయించింది. సోదరులపై కేసు పెట్టి, వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరింది.  


ఇవి కూడా చదవండిImage Caption

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement