Advertisement
Advertisement
Abn logo
Advertisement

భర్తపై మహిళా డాక్టర్ ఫిర్యాదు.. కూతురిపై అత్యాచారయత్నం కేసు.. అసలేం జరిగిందంటే..

మనిషిలో మృగ వాంఛలు పెరిగి వావివరుసలు మరిచిపోతే అతడు పశువుతో సమానం. అలాంటి పశుతత్వంతో ప్రవర్తించింది ఒక డాక్టర్. మన సమాజంలో డాక్టర్ అంటే ఒక ఉన్నత స్థాయి వ్యక్తి. మరి అలాంటి వ్యక్తి తనకు కూతురు లాంటి అమ్మాయిపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడంటూ ఒక మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.


వివరాలలోకి వెళితే.. రాజస్థాన్ రాష్ట్రంలోని పాలి నగరంలోని ట్రాన్స్‌పోర్ట్ నగర్‌లో నివసించే డాక్టర్ ప్రకాశ్‌(55, పేరు మార్చబడినది) మొదటి భార్యతో విడాకులు తీసుకున్నాడు. ఆ తరువాత 2010లో తన ఆస్పత్రిలోనే పనిచేసే డాక్టర్ నలిని(పేరు మార్చబడినది)తో పెళ్లి చేసుకున్నాడు. డాక్టర్ నలినికి మొదటి భర్త చనిపోగా ఆమెకు ఒక కూతురు సునిధి(పేరు మార్చబడినది) కూడా ఉంది. ప్రస్తుతం ఆ అమ్మాయికి 17 ఏళ్లు. 


పెళ్లైన కొన్ని సంవత్సరాల తరువాత నుంచి నలిని, ప్రకాశ్‌ల మధ్య అభిప్రాయ భేదాలు తెలెత్తాయి. దీంతో ఇద్దరు తరుచూ గొడవపడేవారు. ఇదిలా ఉండగా.. ఇటీవలే అక్టోబర్ 29న నలిని, తన కూతురు సునిధితో తన గదిలో నిద్రపోతూ ఉండగా.. అర్ధరాత్రి డాక్టర్ నలినికి తన కూతురి అరుపులు వినిపించాయి. దీంతో ఆమె ఒక్కసారిగా నిద్రలేచి చూడగా.. పక్కన అమ్మాయి కనిపించలేదు. గది నుంచి బయటికి వచ్చి చూడగా.. ప్రకాశ్ తన కూతురి చేయి పట్టుకొని ఉన్నాడు. 


నలిని అక్కడికి రావడంతో ప్రకాశ్ చేయి విడిపించుకొని తన తల్లి నలినికి పట్టుకొని సునిధి ఏడ్చేసింది. ప్రకావ్ తనపై అత్యాచారం చేయబోయాడని చెప్పింది. ఆ తరువాత డాక్టర్ ప్రకాశ్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. మరుసటి రోజు డాక్టర్ నలిని తన భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. డాక్టర్ ప్రకాశ్ దేశం వదిలి త్వరలో పారిపోతున్నాడని అతడిని త్వరగా పట్టుకోవాలని పోలీసులకు చెప్పింది. 


పోలీసులు ఇంకా డాక్టర్ ప్రకాశ్‌పై ఎటువంటి కుసు నమోదు చేయలేదు. డాక్టర్ నలిని చేసిన ఫిర్యాదు మేరకు విచారణ చేసిన తరువాతే నిజం బయటపడుతుందని పోలీసులు అంటున్నారు. డాక్టర్ ప్రకాశ్ ఎక్కడున్నాడో ఇంకా తెలియలేదు.

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement