Advertisement
Advertisement
Abn logo
Advertisement

భర్త బంధువుతో ప్రేమ.. ఇద్దరూ కలవడానికి ఆ పని చేశారు.. చివరికి వారి పరిస్థితి ఏమైదంటే..

వివాహం తరువాత భర్త కంటే అతని బంధువు ఒకడు అందంగా ఉండడంతో అతడితో ఆమె ప్రేమలో పడింది. అతను ఆమె ఇంటికి తరుచూ వచ్చేవాడు. భర్తలేని సమయంలో అతనికి ఫోన్ చేసేది. అలా వారిద్దరూ ఒకరు లేక మరొకరు ఉండలేక పోయేవారు. చివరికి వారిద్దరూ ఏకమయ్యేందుకు ఏం చేశారంటే..


ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్ నగరంలో నివసించే హారూన్‌కి సంవత్సరం క్రితం పక్క గ్రామానికి చెందిన నర్గిస్ అనే యువతితో వివాహం జరిగింది. హారూన్ అందంగా లేకపోవడంతో అతడిన నర్గిస్ ఇష్టపడేదికాదు. హారూన్ బావ(మామ కొడుకు) సమీర్ మొహమ్మద్ అప్పుడప్పుడూ వారింటికి వచ్చేవాడు. సమీర్ చాలా అందగాడు. హారూన్ కారు డ్రైవర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు.


సమీర్ హారూన్ వద్ద డ్రైవింగ్ నేర్చుకునేవాడు. ఇంటికి వచ్చినప్పుడల్లా నర్గిస్ అతనికి మర్యాదలు బాగా చేసేది. సమీర్ ఒకరోజు హారూన్ లేని సమయంలో ఇంటికి వచ్చాడు. అప్పుడు నర్గిస్ అతడిని తన మనసులో మాట చెప్పింది. దానికి సమీర్ కూడా ఒప్పుకున్నాడు. అలా వారిద్దరూ ప్రేమికులుగా మారారు. హారూన్ లేని సమయంలో ప్రేమికులిద్దరూ కలుసుకునేవారు. కొన్ని రోజుల తరువాత హారూన్‌కి అనుమానం వచ్చింది. దీంతో నర్గిస్‌తో దురుసుగా ప్రవర్తించేవాడు. సమీర్‌ని కూడా ఇంటికి రావద్దన్నాడు. కానీ సమీర్‌ని వదిలి నర్గిస్ ఉండలేకపోయింది.


సమీర్‌తో నర్గిస్ బయట కలిసింది. ఇద్దరూ కలిసి ఉండేందుకు ప్లాన్ వేసింది. దాని ప్రకారం అక్టోబర్ 27న సమీర్ హరూన్‌కి ఫోన్ చేసి తన ఇంటికి విందుకోసం రమ్మన్నాడు. హారూన్ రాగానే అతనికి స్పెషల్ టీ అంటూ అందులో మత్తుమందు కలిపి ఇచ్చాడు. హారూన్ మత్తులో ఉండగా.. వెనుక నుంచి నర్గిస్ తన భర్త తలపై ఒక కర్రతో కొట్టింది. హారూన్ అపస్మారక స్థితిలో ఉండగా.. సమీర్ కత్తితో అతని గొంతు కోసాడు. ఆ తరువాత ఇద్దరూ కలిసి హారూన్ మృతదేహాన్ని ఊరి బయట అడివిలో పడేశారు. 


హారూన్ రెండు రోజులుగా ఇంటికి రాలేదని పోలీసులకు నర్గిస్ ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఊరి బయట అడవిలో గుర్తుతెలియని శవం దొరకడంతో పోలీసలు మిస్సింగ్ కేసు ఫిర్యాదు చేసిన వారందరికీ పిలిచారు. దీంతో నర్గిస్ అది తన భర్త శవమేనని గుర్తించింది. పోలీసులు హారూన్ హత్య కేసు విచారణలో భాగంగా అతని ఫోన్ కాల్ రికార్డ్స్ పరిశీలించారు. అతనికి చివరగా ఫోన్ చేసింది సమీర్ కావడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. పోలీసుల పెట్టే చిత్రహింసలు భరించలేక సమీర్ నిజం చెప్పేసాడు. నర్గిస్ చెప్పినట్టే తాను చేసానని ఒప్పుకున్నాడు. దీంతో పోలీసులు నర్గిస్, సమీర్‌ని హారూన్ హత్య కేసులో నిందితులుగా అరెస్టు చేశారు. 

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement