Maharashtra: భార్య,భర్త, సమీప బంధువులను ఒకే శాఖలో నియమించకూడదు

ABN , First Publish Date - 2021-09-16T18:03:01+05:30 IST

ప్రభుత్వంలోని ఒక విభాగంలో ఒకే కుటుంబానికి చెందిన వారిని నియమించరాదంటూ మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు జారీ చేసింది....

Maharashtra: భార్య,భర్త, సమీప బంధువులను ఒకే శాఖలో నియమించకూడదు

సర్కారు సంచలన ఉత్తర్వులు

ముంబై : ప్రభుత్వంలోని ఒక విభాగంలో ఒకే కుటుంబానికి చెందిన వారిని నియమించరాదంటూ మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. ఒక ప్రభుత్వ విభాగంలో భార్య, భర్త, ఇతర దగ్గరి బంధువులను నియమించరాదని మహారాష్ట్ర సర్కారు జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్టుమెంటును(జీఏడీ) ఆదేశించింది. ఏదైనా ప్రభుత్వ శాఖలో బదిలీ పోస్టింగ్ చేస్తున్నప్పుడు, ప్రతి ఒక్కరూ భర్త లేదా భార్య లేదా ఇతర దగ్గరి బంధువులను ఒకే శాఖలో నియమించకుండా జాగ్రత్త వహించాలని జీఏడీ సర్క్యులర్ పేర్కొంది. ఒకవేళ దగ్గరి బంధువులు, భర్త లేదా భార్యను ఒకే విభాగంలో పోస్టు చేయడం అనివార్యం అయితే వారి పనితీరు అంచనా నివేదికను విడివిడిగా తయారు చేయాలని జీఏడీ ఆదేశించింది.

Updated Date - 2021-09-16T18:03:01+05:30 IST