Advertisement
Advertisement
Abn logo
Advertisement

అర్ధరాత్రి నిద్ర పట్టక భర్త ఫోన్‌లో ఫొటోలు చూస్తున్న భార్యకు ఊహించని షాక్.. ఓ ఫొటోను చూసి ఆగ్రహంతో..

ఇంటర్నెట్ డెస్క్: భార్యాభర్తలిద్దరూ భోజనం చేశారు. పడుకునే ముందు భర్త మొబైల్ తీసుకున్న ఆమె.. ఫొటోలు చూస్తోంది. భర్త నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నాడు. అదే సమయంలో భర్త ఫోన్‌లో భార్యకు ఒక ఫొటో కనిపించింది. ఆ ఫొటోలో ఎవరో యువతి ఉండటంతో.. ఆమె ఆగ్రహం కట్టలు తెంచుకుంది. నిద్రపోతున్న భర్త వైపు ఆగ్రహంతో చూసి, వంటగదిలోకి వెళ్లింది. అక్కడున్న రోటిలో ఉపయోగించే పత్రం ఆమె కంటపడింది. దాన్ని తీసుకొచ్చి భర్త తలపై గట్టిగా కొట్టింది. అంతటితో ఆగకుండా గొడ్డలి తీసుకొచ్చి దాడి చేసింది. దీంతో ఆ భర్త నిద్రలోనే మరణించాడు.


ఉదయాన్నే వాళ్లను కలవడానికి వచ్చిన తాతయ్యకు మనుమడి మృతదేహం కనిపించింది. ఈ ఘోరమైన ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని కొరియా ప్రాంతంలో వెలుగు చూసింది. స్థానికంగా నివసించే భూపేంద్ర రాజవాడే (26).. రెండేళ్ల క్రితం అనురాధ అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లిచేసుకున్నాడు. వీళ్లది కులాంతర వివాహం కావడంతో కుటుంబ సభ్యులు వారిని ఇంట్లోకి రానివ్వలేదు. అయితే పూర్తిగా వదిలేయకుండా ఇంటికి దగ్గరే ఒక చిన్న ఇల్లు వాళ్లకు ఇచ్చారు. ఈ దంపతులకు ఒక పాప కూడా పుట్టింది. ఈ క్రమంలో తాజాగా భర్త ఫోన్‌లో పరాయి స్త్రీ ఫొటోలు చూసి అనురాధ ఆగ్రహంతో ఊగిపోయింది. ఈ క్రమంలోనే నిద్రపోతున్న భర్తపై పత్రం, గొడ్డలితో దాడి చేసి చంపేసింది.

హత్య చేసిన తర్వాత గదిలో పడిన రక్తపు మరకలను మొత్తం శుభ్రంగా కడిగేసిన అనురాధ.. భూపేంద్ర దుస్తులు కూడా మార్చిందట. ఉదయాన్నే వాళ్ల తాతయ్య వచ్చే సరికి ఆమె ఇంట్లో లేదు. భూపేంద్ర మృతదేహం కూడా ఇంటి బయట అరుగుపై పడి ఉంది. పాప ఇంట్లో ఉంది. చుట్టుపక్కల వారిని ఆరా తీస్తే.. అనురాధ ఉదయాన్నే ఊరు దాటి వెళ్లడం చూసినట్లు వాళ్లు చెప్పారు. అయితే అప్పటికే ఆమె పోలీసు స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఇంట్లో రక్తంతో తడిసిన దుస్తులు, పత్రం, గొడ్డలిని స్వాధీనం చేసుకున్నారు. మొదట హత్యను దాచి పెట్టాలనుకున్న అనురాధ.. ఆ తర్వాత ఏమైందో నేరుగా వచ్చి పోలీసులకు లొంగిపోయినట్లు తెలుస్తోంది.

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement