భర్త హత్యకు పక్కా స్కెచ్.. వాయిదాల్లో డబ్బిచ్చేందుకు భార్య డీల్.. చివరకు సీన్ రివర్స్..

ABN , First Publish Date - 2021-06-14T22:03:40+05:30 IST

తనను తరచుగా వేధిస్తూ వేరే మహిళలతో సంబంధాలు పెట్టుకున్న భర్త అంతు చూడాలనుకుంది.

భర్త హత్యకు పక్కా స్కెచ్.. వాయిదాల్లో డబ్బిచ్చేందుకు భార్య డీల్.. చివరకు సీన్ రివర్స్..

తనను తరచుగా వేధిస్తూ వేరే మహిళలతో సంబంధాలు పెట్టుకున్న భర్త అంతు చూడాలనుకుంది. అందుకు ఓ కిరాయి గూండాను ఏర్పాటు చేసుకుంది. అయితే అతను అడిగినంత డబ్బు ఆమె వద్దు లేదు. దీంతో ముందు కొంత అడ్వాన్స్‌గా కట్టి మిగిలింది వాయిదా పద్ధతిలో చెల్లించాలనుకుంది. అయితే చివరి నిమిషంలో పోలీసులు ఎంటర్ కావడంతో సీన్ రివర్స్ అయింది.  


తనను, తన కుటుంబాన్ని దూషించడమే కాకుండా వేరే మహిళలలో సంబంధాలు పెట్టుకున్నాడనే కారణంతో పెన్సిల్వేనియాకు చెందిన ఓ మహిళ తన భర్తను చంపించాలని నిర్ణయించుకుంది. ఒక డిటెక్టివ్‌కు ఆ పనిని అప్పగించింది. అయితే అతను ఆ పనికి 4000 డాలర్లు అడిగాడు. ఆమె వద్ద అంత డబ్బు లేదు. దీంతో వంద డాలర్ల చొప్పున వాయిదా పద్ధతుల్లో చెల్లించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. తన భర్తను ఎందుకు చంపించాలనుకుంటోందో వివరంగా చెప్పి అతనికి 100 డాలర్లు అడ్వాన్స్‌గా ఇచ్చింది. అయితే రహస్య అపరేషన్ ద్వారా పోలీసులకు ఈ విషయం తెలిసింది. ఆమెను అరెస్ట్ చేసి దర్యాఫ్తు ప్రారంభించారు. పోలీసుల విచారణలో ఆమె అన్నీ అంగీకరించింది. ఇప్పుడే కాదు 2015లో కూడా తన భర్తను చంపించేందుకు ప్రణాళిక వేసినట్టు ఒప్పుకుంది. 

Updated Date - 2021-06-14T22:03:40+05:30 IST