Advertisement
Advertisement
Abn logo
Advertisement
Mar 30 2021 @ 16:19PM

భర్త చేతిలో భార్య దారుణ హత్య

నిజామాబాద్: అనుమానం పెనుభూతమై ఓ ఇల్లాలి ప్రాణం తీసింది. ఈ దారుణమైన ఘటన జిల్లాలోని నాగారం కాలనీలో జరిగింది. తన భార్య ప్రవర్తనపై భర్తకు అనుమానం కలిగింది. ఈ అనుమానం రోజురోజుకి అతనిలో బలపడింది. దీంతో తన భార్య గొంతుకోసి దారుణంగా హత్య చేశాడు. ఈ సంఘటన కాలనీలో తీవ్ర భయాందోళనకు దారి తీసింది. 80 క్వార్టర్స్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement
Advertisement