ఆ యువతికి ప్రభుత్వోద్యోగం వస్తుందనుకుని పెళ్లి.. మెయిన్స్‌లో ఫెయిల్ కావడంతో బయటపడ్డ భర్త నిజస్వరూపం

ABN , First Publish Date - 2021-08-01T03:11:29+05:30 IST

ప్రభుత్వ ఉద్యోగం కోసం పరీక్ష రాసిందామె. ప్రిలిమ్స్ ప్యాసయింది. మెయిన్స్ ఫలితాల కోసం ఎదురు చూస్తోంది. అవి ఆలస్యమైపోతున్నాయి.

ఆ యువతికి ప్రభుత్వోద్యోగం వస్తుందనుకుని పెళ్లి.. మెయిన్స్‌లో ఫెయిల్ కావడంతో బయటపడ్డ భర్త నిజస్వరూపం

ఇంటర్నెట్ డెస్క్: ప్రభుత్వ ఉద్యోగం కోసం పరీక్ష రాసిందామె. ప్రిలిమ్స్ ప్యాసయింది. మెయిన్స్ ఫలితాల కోసం ఎదురు చూస్తోంది. అవి ఆలస్యమైపోతున్నాయి. అప్పుడే పెళ్లి జరిగిపోయింది. అత్తమామలు, భర్త కూడా బాగానే చూసుకుంటున్నారు. మెయిన్స్ ఫలితాలు ఆమె జీవితాన్ని మార్చేశాయి. ఈ పరీక్షల్లో ఆమె ఫెయిలైందని తెలిసిన భర్త, అత్తమామలు తమ నిజస్వరూపాలను బయటపెట్టారు. ఆమెను హింసించసాగారు. కొట్టడం, తిట్టడం మరీ ఎక్కువైపోయింది. ఈ బాధలు భరించడం కష్టమైనా, పెళ్లి చేసుకున్న పాపానికి భరిస్తూ వచ్చిందామె. అయితే చివరకు భర్త కుటుంబం ఆమెను ఇంటి నుంచి గెంటేసింది. ప్రభుత్వ ఉద్యోగం వస్తుందనే ఊహతోనే తనను భర్త పెళ్లి చేసుకున్నాడని, ఆ అవకాశం పోవడంతో నిజస్వరూపం బయటపెట్టడాని ఆమె వాపోతోంది. ఇదీ రాజస్థాన్‌లోని జూంఝునూ జిల్లాకు చెందిన ఉషా కుమారి దీనగాధ.


2013లో రాజస్థాని అడ్మినిస్టేటివ్ సర్వీసెస్ (ఆర్ఏఎస్) పరీక్షలు రాసిన ఉష(29).. ప్రిలిమ్స్ ప్యాసయింది. 2015లో ఈ ఫలితాలు వచ్చిన తర్వాత ఆమెకు 2016లో చెందిన వికాస్(35) పెళ్లయింది. పెళ్లి తర్వాత డిసెంబరులో మెయిన్స్ ఎగ్జామ్ జరిగింది. ఆ పరీక్షల ఫలితాలు విడుదలైన తర్వాత ఆమె జీవితం తలకిందులైంది. మెయిన్స్‌లో ఉష ఫెయిలైందని తెలిసిన మెట్టినింటి వారు ఆమెకు నరకం చూపించడం ప్రారంభించారు. పది లక్షల రూపాయలు వరకట్నం తీసుకురావాలంటూ ఆమెను హింసించడం మొదలుపెట్టారు. అప్పటి వరకూ రాముడిలా ఉన్న భర్త.. సడెన్‌గా మద్యం తాగి వచ్చి ఉషను చావబాదడం ప్రారంభించాడు. వేరే ఉద్యోగాలకు పరీక్ష రాయడానికి ఆమె ప్రయత్నాలు మొదలు పెట్టడంతో ఆమెను మరింత నిందించసాగారు. ఈ క్రమంలో తాజాగా ఆమెను ఇంటి నుంచి గెంటేశారు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. దీంతో ఉష అత్తమామలు, ఆమె భర్త వికాస్‌పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 

Updated Date - 2021-08-01T03:11:29+05:30 IST