సోదరుడితోనే భార్య వివాహేతర సంబంధం.. ఎన్నిసార్లు చెప్పినా మారని తీరు.. విసుగొచ్చి ఆ భర్త తీసుకున్న నిర్ణయమిది..!

ABN , First Publish Date - 2021-08-26T19:31:17+05:30 IST

ఇష్టపడి పెళ్లి చేసుకున్న భార్య.. ఇంట్లోనే అతని బావతో అక్రమసంబంధం పెట్టుకుంది. వరుసకు సోదరుడయ్యే వ్యక్తితో ఇలా తన భార్య వివాహేతర బంధం పెట్టుకున్నట్లు తెలిసి ఆ యువకుడు ఆగ్రహం వ్యక్తంచేశాడు.

సోదరుడితోనే భార్య వివాహేతర సంబంధం.. ఎన్నిసార్లు చెప్పినా మారని తీరు.. విసుగొచ్చి ఆ భర్త తీసుకున్న నిర్ణయమిది..!

ఇంటర్నెట్ డెస్క్: ఇష్టపడి పెళ్లి చేసుకున్న భార్య.. ఇంట్లోనే అతని బావతో అక్రమసంబంధం పెట్టుకుంది. వరుసకు సోదరుడయ్యే వ్యక్తితో ఇలా తన భార్య వివాహేతర బంధం పెట్టుకున్నట్లు తెలిసి ఆ యువకుడు ఆగ్రహం వ్యక్తంచేశాడు. ఆమె చేస్తుంది తప్పని వివరించాడు. ఎన్నిసార్లు తన పద్ధతి మార్చుకోవాలని చెప్పినా ఆమె వినలేదు. దీంతో విసుగొచ్చిన అతను దారుణ నిర్ణయం తీసుకున్నాడు. తన మరణానికి భార్య, బావను కారకులుగా పేర్కొంటూ సూసైడ్ నోట్ రాసి ఉరేసుకున్నాడు. ఈ ఘటన బిహార్‌లోని పట్నాలో వెలుగు చూసింది. పట్నాకు చెందిన అవినాశ్ అనే వ్యక్తికి కొంతకాలం క్రితం పెళ్లయింది. అతని సోదరి భర్త సంజయ్‌తో అవినాశ్ భార్య వివాహేతర సంబంధం పెట్టుకుంది. దీన్ని సహించలేని అవినాశ్.. తన భార్యకు పలుమార్లు నచ్చజెప్పడానికి ప్రయత్నించాడు.


ఈ నేపథ్యంలో భార్యాభర్తల మధ్య దాదాపు ప్రతిరోజూ ఏదో ఒక విషయంలో గొడవ జరుగుతూనే ఉండేదని అవినాశ్ చెల్లెలు చెప్పింది. తాజాగా తన సోదరిని, బావను ఇంటికి పిలిచిన అవినాశ్.. వాళ్లిద్దరితో చాలా సీరియస్‌గా మాట్లాడినట్లు ఆమె తెలిపింది. తన భార్యతో సంబంధం తెంచుకోకపోతే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బావను బెదిరించాడు. అయినా సరే భార్య ప్రవర్తనలో మార్పు రాలేదు. వరుసకు సోదరుడయ్యే తన బావతో వివాహేతర సంబంధం కొనసాగిస్తూనే ఉంది. దీంతో విసిగిపోయిన అవినాశ్ ఉరిపోసుకున్నాడు. ఈ విషయం తెలిసి ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. అవినాశ్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు. అతని గదిలో నుంచి సూసైడ్ నోట్‌ను కూడా వాళ్లు స్వాధీనం చేసుకున్నారు. అన్ని కోణాల్లో కేసును దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Updated Date - 2021-08-26T19:31:17+05:30 IST