Advertisement
Advertisement
Abn logo
Advertisement

శోభనం రోజే భర్త చేష్టలకు నివ్వెరపోయిన భార్య.. ఎన్ని రోజులు చెప్పి చూసినా ఫలితం లేకపోవడంతో ఆమె ఏం చేసిందంటే..

ఇంటర్నెట్ డెస్క్: కోటి ఆశలతో కొత్త సంసారంలోకి అడుగుపెట్టిన ఆమె.. భర్త వికృత చేష్టలను భరించలేకపోయింది. మొదటి రోజే తన వికృతత్వాన్ని ప్రదర్శించాడు. అక్కడితో ఆగక.. ఆ తరువాత కూడా తన వికారాల్ని కొనసాగించాడు. మరోమైపు..ఆమె మామ కూడా కొడుకు ఇంట్లో లేని సమయంలో తన దుర్బుధ్దిని ప్రదర్శించే వాడు. ఈ దారుణాలను భరించలేకపోయిన ఆమె చివరికి పోలీసులను ఆశ్రయించింది. అసలేం జరిగిందంటే..

మధ్యప్రదేశ్ రాష్ట్రం గ్వాలియర్‌కు చెందిన ఓ మహిళకు గతేడాది ఫిబ్రవరిలో వివాహం జరిగింది. అయితే.. శోభనం రోజునే భర్త తన వికృత రూపాన్ని బయటపెట్టాడు. ఆమెతో బలవంతంగా అసహజ శృంగారంలో పాల్గొన్నాడు. అది మొదలూ రోజు ఆమెను ఇలాగే వేధించసాగాడు. ఎంత చెప్పినా వినేవాడు కాదు. దీనికి తోడు మామ కూడా ఆమెపై లైగింక వేధింపులకు పాల్పడే వాడు. అత్తగారేమో కోడలిని అదనపు కట్నం తేవాలంటూ వేధించసాగింది. పెళ్లి తరువాత ఎన్నో కలలతో కొత్త జీవితంలో అడుగుపెట్టిన ఆమె ఏకంగా ఒకటిన్నర సంవత్సరాల పాటు నరకం అనుభవించింది. భర్తలో మార్పు రాకపోగా..అత్తమామల వేధింపులు కూడా ఎక్కువవడంతో ఆమె ఇటీవల పోలీసులను ఆశ్రయించింది.

ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు భర్తపై అసహజ శృంగారానికి పాల్పడ్డాడన్న నేరం కింద కేసు నమోదు చేశారు. అంతేకాకుండా.. ఆమె అత్తమామలపై వరకట్న వేధింపుల కేసు పెట్టారు. కాగా.. ఆమె భర్త పోలీసులకు చిక్కినప్పటికీ.. మామ మాత్రం ఇంకా పరారీలో ఉన్నాడు. అతడి కోసం ప్రస్తుతం స్థానిక పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. 

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement