Advertisement
Advertisement
Abn logo
Advertisement

షాపులో పనిచేసే కుర్రాడిని భార్య తరపు బంధువే కదా అని ఇంట్లోనే ఉండమనడమే ఆ భర్త తప్పయింది.. చివరకు..

రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో ఒక గృహిణి తన భర్తను హత్య చేసిన విధానం తెలిసి అందరూ షాకవుతున్నారు. ఒక సాధారణ గృహిణిలా కనిపించే ఆ మహిళ ఇంత పక్కా ప్లానింగ్‌తో హత్య చేసిందా!.. అని అందరూ నివ్వెరపోతున్నారు. 


జైపూర్‌లో నివసించే మంజు రాథోడ్(40)కి 20 ఏళ్ల క్రితం శక్తి సింగ్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. వారిద్దరికీ ఇద్దరు పిల్లలున్నారు. 17 ఏళ్ల కూతురు, 12 ఏళ్ల కొడుకు ఉన్నాడు. అంతా బాగుందను కున్న తరుణంలో మంజు రాథోడ్ 2017లో తన భర్తకు చెప్పకుండా మరో వ్యక్తితో కలిసి ఇల్లు వదిలి వెళ్లిపోయింది. రెండు రోజుల తరువాత ఇంటికి తిరిగి వచ్చేసింది. దీంతో భర్త శక్తి సింగ్ ఆమెపై అనుమానంగా ఉన్నాడు. అప్పటి నుంచి ఆమెను వేధిస్తూ ఉన్నాడు. దీంతో భర్తను ఎలాగైనా వదిలించుకోవాలని మంజు ఒక పథకం వేసింది.


మంజు ఇంట్లో ఒక భాగంలో ఒక కుర్రాడు అద్దెకు ఉంటున్నాడు. అతడి పేరు పంకజ్ శర్మ. పంకజ్‌కి అప్పుల బాధలు ఉన్నాయి. అతడి అప్పులు తాను తీరుస్తానని, కానీ అందుకు ఒక సహాయం చేయమని మంజు అడిగింది. తన భర్తను హత్య చేసేందుకు సహాపడాలని చెప్పింది. ముందు పంకజ్ ఆ పని చేసేందుకు భయపడ్డాడు కానీ మంజు ఎక్కువ డబ్బు ఆశ చూపూ సరికి ఒప్పుకున్నాడు. ప్లాన్ ప్రకారం.. ముందుగా పంకజ్‌ను భర్త శక్తి సింగ్‌కు ఉన్నబట్టల షాపులో పనిలో చేర్పించింది. పంకజ్ ప్రతిరోజు శక్తిసింగ్‌తోనే ఇంటి నుంచి షాపుకు వస్తూ పోతూ ఉన్నాడు. 


దీపావళి రోజు పిల్లలు ఇంటి నుంచి బయటికి వెళ్లినప్పుడు మంజు, పంకజ్ కలిసి శక్తి సింగ్‌ని కత్తులతో పొడిచి చంపారు. ఆ తరువాత ఒక సూట్ కేసులో శవాన్ని దాచి ఉంచారు. శవం వాసన రాకుండా సూట్ కేసు నిండా కర్పూరం వేశారు. ఆ సూట్ కేసు వద్దకు పిల్లలు రాకుండా మంజు జాగ్రత పడింది. తండ్రి పనిమీద వేరే ఊరు వెళ్లాడని వారికి చెప్పింది. రెండు రోజుల తరువాత శవమున్న సూట్ కేసుని తీసుకొని పంకజ్‌తో స్కూటీపై మంజు వెళ్లింది. ఊరు బయట పది కిలోమీటర్ల దూరంలో ఒక నిర్మానుషమైన ప్రదేశంలో శవాన్ని కాల్చి పడేసింది.


పోలీసులకు నవంబర్ 9వ తేదీన సగం కాలిన శవం దొరకడంతో వారు విచారణ మొదలుపెట్టారు. ఆ శవం శక్తి సింగ్‌దేనని తెలుసుకోవడానికి పోలీసులకు ఎంతో సమయం పట్టలేదు. హత్య కేసు విచారణలో ముందుగా పంకజ్‌పై అనుమానంతో అతడిని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి మర్యాదలు చేశారు. పోలీసులకు భయపడి పంకజ్ జరిగినదంతా చెప్పేశాడు. దీంతో మంజు బండారం బయటపడింది. 

ప్రస్తుతం మంజు, పంకజ్‌పై పోలీసులు హత్య కేసు పెట్టి అరెస్టు చేశారు.


ఇవి కూడా చదవండిImage Caption

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement