ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికొచ్చిన తర్వాత భర్త మృతి.. భార్య ప్రవర్తనపై డౌట్.. బంధువులు ఆరా తీస్తే..

ABN , First Publish Date - 2022-01-25T22:31:15+05:30 IST

అతను కొన్ని రోజులుగా కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతున్నాడు.. ఇటీవల పరిస్థితి విషమించడంతో హాస్పిటల్‌లో జాయిన్ అయ్యాడు..

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికొచ్చిన తర్వాత భర్త మృతి.. భార్య ప్రవర్తనపై డౌట్.. బంధువులు ఆరా తీస్తే..

అతను కొన్ని రోజులుగా కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతున్నాడు.. ఇటీవల పరిస్థితి విషమించడంతో హాస్పిటల్‌లో జాయిన్ అయ్యాడు.. చికిత్స అనంతరం రికవరీ కావడంతో వైద్యులు అతడిని ఇంటికి పంపేశారు.. ఇంటికి వెళ్లిన మూడ్రోజులకు అతను మరణించాడు.. అనారోగ్యంతోనే భర్త మృతి చెందాడని భార్య చెప్పింది.. ఎప్పట్నుంచో ఆరోగ్యం బాగోలేదు కనుక అది నిజమేనని బంధువులు నమ్మారు.. అయితే ఆమె ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.. ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు అసలు విషయం బయటపెట్టారు. 


తమిళనాడులోని నాగై జిల్లా కడయన్‌ కాడు ప్రాంతానికి చెందిన దేవేంద్రన్‌ (47) పచ్చకామర్లు, కిడ్నీ సంబంధిత అనారోగ్యంతో తిరుచ్చిలోని ప్రైవేటు ఆస్పత్రిలో కొద్ది రోజుల క్రితం జాయిన్ అయ్యాడు. చికిత్స అనంతరం ఈ నెల 4వ తేదీన ఇంటికి తిరిగి వెళ్లాడు. ఆరో తేదీన మరణించాడు. అనారోగ్యంతోనే దేవేంద్రన్ మృతి చెందాడని అతడి భార్య సూర్య అందరికీ చెప్పింది. దేవేంద్రన్‌ అనారోగ్యం గురించి అందరికి తెలియడంతో వారు కూడా సూర్య చెప్పిన మాటను నమ్మేశారు. అయితే ఆ తర్వాతి నుంచి సూర్య ప్రవర్తనలో మార్పు వచ్చింది. సూర్య ఎక్కువగా ఫోన్లో మాట్లాడుతుండడం, కంగారు పడుతుండడం గమనించి పోలీసులకు బంధువులు, కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. 


కేసు నమోదు చేసుకున్న పోలీసులు సూర్యను అరెస్ట్ చేసి తమదైన రీతిలో విచారణ చేయగా అసలు విషయం బయటపడింది. తమ ప్రాంతానికే చెందిన ఇంజినీరు చంద్రశేఖర్‌‌తో సూర్య వివాహేతర సంబంధం పెట్టుకుంది. భర్త ఇంట్లో లేనప్పుడు చంద్రశేఖర్‌తో శృంగారం కూడా సాగించేది. తమ బంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన సూర్య ఎలాగైనా అతడి అడ్డు తొలగించాలనుకుంది. దీని కోసం పక్కా ప్లాన్ వేసింది. భర్త అనారోగ్యాన్ని తనకు అనుకూలంగా మార్చుకుంది. హాస్పిటల్‌లో చికిత్స అనంతరం ఇటీవల ఇంటికి వచ్చిన భర్తకు సాంబార్‌లో విషం కలిపి పెట్టి చంపేసింది. పోలీసుల విచారణలో తన నేరాన్ని అంగీకరించింది. 

Updated Date - 2022-01-25T22:31:15+05:30 IST