గృహిణి పొదుపును... ఆదాయంగా పరిగణించడం సరికాదు.. ఐటీఏటీ...

ABN , First Publish Date - 2021-06-25T01:15:07+05:30 IST

ఆదాయపు పన్నుకు సంబంధించి గృహిణులకు ప్రభుత్వం వెసులుబాటునిచ్చింది. డీ మోనిటైజేషన్ తర్వాత గృహిణులు జమ చేసుకున్న మొత్తం... ఆదాయపు పన్ను దర్యాప్తు పరిధిలోకి రాదని తెలిపింది.

గృహిణి పొదుపును... ఆదాయంగా పరిగణించడం సరికాదు.. ఐటీఏటీ...

న్యూఢిల్లీ : ఆదాయపు పన్నుకు సంబంధించి గృహిణులకు ప్రభుత్వం వెసులుబాటునిచ్చింది. డీ మోనిటైజేషన్ తర్వాత గృహిణులు జమ చేసుకున్న మొత్తం... ఆదాయపు పన్ను దర్యాప్తు పరిధిలోకి రాదని తెలిపింది. కాగా... ఈ మొత్తం సొమ్ము రూ. 2.5 లక్షలకు మించరాదు. . అటువంటి డిపాజిట్లను ఆదాయంగా పరిగణించలేమని ఆదాయపు పన్ను అప్పీలేట్ ట్రిబ్యునల్ (ఐటీఏటీ) అభిప్రాయపడింది. గ్వాలియర్ కు చెందిన గృహిణి ఉమా అగర్వాల్ 2016-17 సంవత్సరానికి... తన బ్యాంకు ఖాతాలో రూ . 2.11 లక్షల నగదును జమ చేసింది. ఈ మొత్తంపై పన్ను కట్టాల్సిందిగా ఆదాయపు పన్ను శాఖ డిమాండ్ చేసింది.


దీనితో విబేధించిన అగర్వాల్... ఆదాయపు పన్ను అప్పీలేట్ ట్రిబ్యునల్‌ను సంప్రదించారు. ఈ మొత్తాన్ని తన భర్త, కుమారుడు, బంధువులు కుటుంబానికిచ్చిన మొత్తంలో పొదుపు రూపంలో జమ చేసినట్లు అగర్వాల్ తెలిపారు. సీఐటీ (అప్పీల్స్) ఈ వివరణను అంగీకరించలేదు అంతేకాకుండా రూ. 2.11 లక్షల నగదు డిపాజిట్‌ను వివరించలేదంటూ... డబ్బుగా పరిగణించే అసెస్సింగ్ ఆఫీసర్ ఆదేశాన్ని ధృవీకరించింది. దీని తరువాత అగర్వాల్ ఈ విషయాన్ని ఆదాయపు పన్ను అప్పీలేట్ ట్రిబ్యునల్ (ఐటీఏటీ) కు  తీసుకువెళ్ళారు.


ఆగ్రా లోని ఐటీఏటీలో జ్యుడిషియల్ సభ్యుడు లలిత్ కుమార్, అకౌంట్స్ సభ్యుడు డాక్టర్ మితా లాల్ మీనా మాట్లాడుతూ, ‘డీమోనిటైజేషన్ సమయంలో ఆ మహిళ జమ చేసిన రూ.  .2,11,500 మొత్తం రూ . 2.5 లక్షల పరిమితిలో ఉందని చెప్పారు. అందువల్ల దీనిని అదనపు ఆదాయంగా పరిగణించలేము. దీని అర్థం అది ఆమె సంపాదించింది కాదు. అందువల్ల దానిపై ఎటువంటి పన్ను ఉండదు’ అన్నారు. ట్రిబ్యునల్ తన ఉత్తర్వుల్లో... భర్త, పిల్లలు, బంధువుల నుండి అందుకున్న చిన్న మొత్తాలను జోడించి ఈ మొత్తాన్ని ఆదా చేసినట్లు అగర్వాల్ తెలిపారు. 

Updated Date - 2021-06-25T01:15:07+05:30 IST