వీడియో కాన్ఫరెన్స్‌‌లో భర్త.. దగ్గరకొచ్చిన భార్య.. వీడియో వైరల్

ABN , First Publish Date - 2021-02-20T18:39:47+05:30 IST

కరోనా వల్ల అనేక సంస్థలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ సదుపాయాన్ని కల్పించాయి. దీంతో ఉద్యోగులంతా తమ ఇళ్లనుంచే ఉద్యోగాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొన్నిసార్లు విచిత్రమైన సంఘటనలు..

వీడియో కాన్ఫరెన్స్‌‌లో భర్త.. దగ్గరకొచ్చిన భార్య.. వీడియో వైరల్

ఇంటర్నెట్ డెస్క్: కరోనా వల్ల అనేక సంస్థలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ సదుపాయాన్ని కల్పించాయి. దీంతో ఉద్యోగులంతా తమ ఇళ్లనుంచే ఉద్యోగాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొన్నిసార్లు విచిత్రమైన సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అందులో కొన్నిసార్లు ప్రయివేటుగా ఉండాల్సిన పడగ్గది రొమాన్స్ పబ్లిక్ అయిపోతోంది. అలాంటి సంఘటనే తాజాగా ఓ ఉద్యోగికి ఎదురైంది. ఓ వ్యక్తి వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ, ఇండియా జీడీపీ గురించి సీరియస్‌గా లెక్చర్ ఇస్తున్నాడు. ఇంతలో అతడి భార్య సీన్లోకి వచ్చింది. అతడిని ముద్దాడబోయింది. అంతే ఒక్కసారిగా షాకయిన ఆయన.. కెమెరా ఆన్‌లో ఉంది పాగల్. వాట్ నాన్‌సెన్స్..’ అంటూ చిరుకోపం ప్రదర్శించాడు. 


దీంతో వెనక్కి తగ్గిన భార్య.. ‘సర్లే సర్లే మీటింగ్ సంగతి కానీయండీ’ అంటూ ఆమె ముసిముసిగా నవ్వింది. ఈ తంతంతా కెమెరాలో రికార్డు కావడంతో ఇప్పుడు ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ‘అబ్బ..! భర్తంటే ఆమెకు ఎంత ప్రేమో కదా..’ అని కొందరు నెటిజన్లు కామెంట్ చేస్తే. .మరికొందరేమో చివర్లో ఆమె నవ్వే హైలైట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.



Updated Date - 2021-02-20T18:39:47+05:30 IST

Read more