Abn logo
Sep 21 2021 @ 19:30PM

రోజూ మద్యం తాగి గొడవ పడుతున్న భార్య.. ఎన్నిసార్లు చెప్పినా వినకపోవడంతో విసుగొచ్చి ఆ భర్త చేసిన దారుణమిది...

ఇంటర్నెట్ డెస్క్: బిందెతో నీళ్లు తీసుకుని పొరుగింటి మహిళ వీధిలో నడుచుకుంటూ వెళుతోంది. ఆమె ఓ పక్కకు తలతిప్పి చూడగా.. ఓ ఇంట్లో ఫ్యానుకు ఏదో వేలాడుతూ కనిపించింది. మరో రెండు అడుగులు వేసి చూడగా...అక్కడి దృశ్యం స్పష్టంగా కనిపించి ఆమెకు నోటమాట రాలేదు. నేలపై రక్తపుమడుగులో పడి ఉన్న భార్య..ఆపక్కనే ఉరిపోసుకుని ప్రాణాలు వదిలిన భర్త. ఈ దృశ్యం చూసి నిర్ఘాంతపోయిన ఆమె పరుగుపరుగున వెళ్లి గ్రామ సర్పంచ్‌కు తాను చూసిన దారుణం గురించి చెప్పింది. మరోవైపు..ఈ వార్త క్షణాల్లో దావానలంలా ఊరంతా చుట్టేసింది. భార్య వేధింపులకు తట్టుకోలేని భర్తే ఆమె గొంతు కోసి చంపేశాడని తెలిసి గ్రామస్తులు అవాక్కయ్యారు. అసలేం జరిగిందంటే..

ఇవీ చదవండి:

గంటల వ్యవధిలో రూ. 7300 కోట్లు హాం ఫట్.. ఓ బిలియనీర్‌కు భారీ షాక్..!

భర్తను చంపి మృతదేహాన్ని రసాయనాల్లో కరిగించేద్దామనుకుంటే.. చివరికు జరిగింది ఇదీ..

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం గురేలా పెండ్రా మర్వాహీ జిల్లాకు చెందిన సమయ్ లాల్ పనికా పీడబ్ల్యూడీ విభాగంలో పనిచేసి రిటైర్ అయ్యారు. ఆయనకు సుశీలా బాయ్ అనే మహిళతో కొన్నేళ్ల క్రితమే రెండో వివాహం జరిగింది. సమయ్‌ లాల్‌కు నలుగురు ఆడపిల్లలుకాగా.. వారందరికీ వివాహాలు అయిపోయాయి. అయితే..భార్య తాగుడుకు బానిసవడంతో ఈ విషయమై దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ప్రతి రోజూ తాగుతూ ఆమె భర్తతో పేచీ పెట్టుకునేది. కుమార్తెలను కూడా కలవనిచ్చేది కాదు. ఇదిలా ఉంటే..ఆదివారం నాడు కూడా వారి మధ్య మరోమారు ఘర్షణ జరిగింది.


భార్య తీరుతో విసిగిపోయిన సమయ్.. కొడవలితో ఆమె గొంతు కోసి హత్య చేశాడు. ఆపై తాను కూడా ఉరిపోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబసభ్యుల సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఘటనాస్థలం నుంచి ఓ కొడవలిని కూడా స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్‌మార్టం తరువాత అసలు అక్కడ ఏం జరిగిందనే దానిపై పూర్తి స్పష్టత వస్తుందని వారు తెలిపారు. 

ప్రత్యేకంమరిన్ని...