Viral Video: ముందున్న ప్రమాదం నుంచి బయటపడాలనుకున్న అడవి పంది.. అంతలోనే వెనుక నుంచి..

ABN , First Publish Date - 2022-03-15T22:47:56+05:30 IST

సోషల్ మీడియాలో అడవి పందికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ముందున్న ప్రమాదం నుంచి బయటపడాలని ఎంతో ఓపికతో ఎదురుచూసింది. అయితే పాపం వెనుక నుంచి..

Viral Video: ముందున్న ప్రమాదం నుంచి బయటపడాలనుకున్న అడవి పంది.. అంతలోనే వెనుక నుంచి..

మృత్యువు ఎటువైపు నుంచి ఎప్పుడు ఏవిధంగా వస్తుందో చెప్పలేం. కొన్నిసార్లు మృత్యువు అంచుల వరకూ వెళ్లి.. క్షేమంగా తిరిగి వచ్చిన వారిని చూస్తుంటాం. అలాగే అంతవరకూ మన మధ్యే తిరుగుతున్న వారు.. సడన్‌గా మృత్యు ఒడిలోకి జారుకోవడాన్ని కూడా చూస్తూనే ఉంటాం. మనుషులకే కాకుండా అన్ని జీవరాశుల విషయంలోనూ ఇలాగే జరుగుతుంటుంది. ఈ విషయం పక్కన పెడితే ప్రస్తుతం సోషల్ మీడియాలో అడవి పందికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ముందున్న ప్రమాదం నుంచి బయటపడాలని ఎంతో ఓపికతో ఎదురుచూసింది. అయితే పాపం వెనుక నుంచి వచ్చిన మృత్యువును మాత్రం గుర్తించలేకపోయింది.


అడవుల్లో జంతువుల మధ్య తలెత్తే పోరాటానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం మనం చూడబోయే వీడియోలో ఓ కుంట వద్ద అడవి పంది నీరు తాగుతూ ఉంటుంది. తాగిన అనంతరం బయటికి వెళ్దామనుకునే లోపు సీన్ ఒక్కసారిగా మారిపోతుంది. హైనాల గుంపు ఒక్కసారిగా నీటి కుంట గట్టుపై పందిని వేటాడేందుకు సిద్ధంగా ఉంటుంది. దీంతో వాటి నుంచి ఎలా తప్పించుకోవాలని ఆలోచిస్తూ అక్కడే కాసేపు ఆగుతుంది. పైకి వస్తే వేటాడాలని హైనాలు కూడా అక్కడే కాపు కాస్తూ ఉంటాయి. ఈలోగా నీటిలో అడవి పంది వెనకాల ఓ మొసలి మాటు వేసి ఉంటుంది.

పొలానికి నీరు పెడుతున్న కుక్క.. వామ్మో ఇదేం కుక్కరా నాయనా..


హైనాల గుంపు మొసలిని గమనించి.. పంది సమీపానికి రాకుండా గట్టుపైనే కాపు కాచి ఉంటాయి. హైనాల గుంపును గమనించిన అడవి పంది.. వెనుక మొసలి పొంచి ఉండడాన్ని మాత్రం గుర్తించలేకపోతుంది. తీరా గట్టుపైకి వెళదామని ఒక్క అడుగు ముందుకు వేయగానే.. వెనుక నుంచి మొసలి అమాంతం పైకి లేచి పందిని పట్టుకుంటుంది. వెంటనే దాన్ని నీటిలోకి లాక్కుని వెళ్లిపోతుంది. అక్కడే ఉన్న సందర్శకులు.. ఈ ఘటనను తమ కెమెరాల్లో బంధించారు. ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.

ఖడ్గమృగంతో పెట్టుకుంటే మామూలుగా ఉండదు.. సింహాలను తరిమి తరిమి కొట్టిందిగా..





Updated Date - 2022-03-15T22:47:56+05:30 IST