Abn logo
Oct 29 2020 @ 22:48PM

‘వైల్డ్ డాగ్’ టీమ్‌ని చూశారా..

Kaakateeya

ఏడు నెల‌ల త‌ర్వాత ఇటువంటి ప్లేస్‌కు రావ‌డం ఆనందంగా ఉంది' అంటూ మ‌నాలీలో 'వైల్డ్ డాగ్' షూటింగ్ లొకేష‌న్‌ నుంచి కింగ్‌ నాగార్జున ఓ వీడియోని ఇటీవల షేర్‌ చేసిన విషయం తెలిసిందే. అక్కినేని నాగార్జున టైటిల్ రోల్ పోషిస్తోన్న చిత్రం 'వైల్డ్ డాగ్‌'. ఇది మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై నిర్మాణ‌మ‌వుతోన్న 6వ చిత్రం. అహిషోర్ సాల్మ‌న్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా తాజా షెడ్యూల్ హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లోని మ‌నాలీలో ఉన్న సుంద‌ర ప్ర‌దేశాల్లో ఇటీవ‌లే మొద‌లైంది. కింగ్‌ నాగార్జున కూడా ఈ షూటింగ్‌లో జాయినై అక్క‌డి ప్ర‌కృతి సౌంద‌ర్యానికి ప‌ర‌వ‌శించిపోతుననట్లుగా తెలిపారు. తాజాగా ‘వైల్డ్ డాగ్’ చిత్రయూనిట్‌ కొన్ని ఫొటోలను అఫీషియల్‌గా విడుదల చేసింది. ఈ ఫొటోలలో తన వైల్డ్ డాగ్‌ టీమ్‌ని నాగ్‌ పరిచయం చేశారు. సుదీర్ఘంగా కొన‌సాగే ఈ షెడ్యూల్‌లో నాగార్జునతో స‌హా ప్ర‌ధాన పాత్ర‌ధారుల‌పై కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌రిస్తున్నట్లుగా ఈ ఫొటోలను చూస్తుంటే తెలుస్తుంది. 


య‌థార్థ ఘ‌ట‌న‌ల ఆధారంగా రూపొందుతోన్న ఈ చిత్రంలో ఏసీపీ విజ‌య్ వ‌ర్మ‌గా నాగార్జున ఇప్ప‌టివ‌ర‌కూ చేయ‌ని విభిన్న త‌ర‌హా పాత్ర‌ను చేస్తున్నారు. క్రిమిన‌ల్స్‌ను నిర్దాక్షిణంగా డీల్ చేసే విధానం వ‌ల్ల సినిమాలో ఆయ‌న‌ను 'వైల్డ్ డాగ్' అని పిలుస్తుంటారు. నాగార్జున జోడీగా దియా మీర్జా న‌టిస్తున్న ఈ చిత్రంలో ఓ కీల‌క పాత్ర‌లో స‌యామీ ఖేర్ క‌నిపించ‌నున్నారు. మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై నిరంజ‌న్ రెడ్డి, అన్వేష్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి కిర‌ణ్ కుమార్ సంభాష‌ణ‌లు రాస్తుండ‌గా, షానీల్ డియో సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తున్నారు.


Advertisement
Advertisement