వాడీవేడిగా సర్వసభ్య సమావేశం

ABN , First Publish Date - 2022-03-04T05:20:48+05:30 IST

పలు గ్రామాల ప్రజాప్రతినిధులు గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై సభ్యులను నిలదీయడంతో మండల సర్వసభ్య సమావేశం వాడీవేడిగా కొనసాగింది.

వాడీవేడిగా సర్వసభ్య సమావేశం
గ్రామాల్లో నెలకొన్న సమస్యలను అధికారులను వినిపిస్తున్న ఎంపీటీసీ సభ్యుడు

- సమస్యలను లేవనెత్తిన సభ్యులు

మరికల్‌, మార్చి 3 : పలు గ్రామాల ప్రజాప్రతినిధులు గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై సభ్యులను నిలదీయడంతో మండల సర్వసభ్య సమావేశం వాడీవేడిగా కొనసాగింది. ఎంపీపీ శ్రీకళరెడ్డి అధ్యక్ష తన గురువారం మండల పరిషత్‌ కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశం నిర్వహించగా ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే చిట్టెం రాంమ్మోహన్‌రెడ్డి పా ల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ సభ్యుడు గోపాల్‌ మాట్లాడుతూ మండల కేంద్రంలోని హరిజ నవాడలో నిర్మించిన మిషన్‌ భగీరథ ట్యాంకు, నల్లా కలెక్షన్‌లు అసంపూర్తిగా వదిలేయడంతో దళితులకు భగీరథ నీరు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొం టున్నారన్నారు. ముఖ్యంగా వేసవి కాలంలో నీరు సరఫరా కావడం లేదని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. అదే విధంగా విరిగిన విద్యుత్‌ స్తంభాలతో కాలనీవాసులు ఇందులకు గురవుతున్నారని విద్యుత్‌ శాఖ అధికారులకు పలుమార్లు విన్నవించినా సమస్యలు పరిష్కారం కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల్లోని సమస్యలను వివిధ శాఖల అధికారులు వెంటనే పరిష్కరించాలని లేదంటే చర్యలు తప్పవన్నారు. అయిల్‌ ఫామ్‌ తోటలు, పండ్ల తోటలు, ఔషధ మొక్కలు పండించడంతో రైతులకు అధిక లా భాలు వస్తాయని వ్యవసాయాఽధికారులు అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో జడ్పీ వైస్‌ చైర్‌పర్సన్‌ సురేఖరెడ్డి, వైస్‌ ఎంపీపీ రవికుమార్‌, జడ్పీకో ఆప్షన్‌ మెంబర్‌ వహిద్‌, మండల కో ఆప్షన్‌ మెంబర్‌ మతీన్‌, ఎంపీడీవో యశోదమ్మ, ఇన్‌చార్జి తహసీల్దార్‌ జగన్‌చౌహాన్‌, ఆయా గ్రామాల ఎంపీ టీసీలు, సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

Updated Date - 2022-03-04T05:20:48+05:30 IST