Apr 11 2021 @ 10:09AM

'ఆచార్య', 'విరాట పర్వం' సినిమాలకు సెన్సార్‌ సమస్య తప్పదా?

మెగాస్టార్‌ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్‌లో రూపొందుతోన్న భారీ చిత్రం 'ఆచార్య', రానా, సాయిపల్లవి జంటగా నటిస్తోన్న 'విరాట పర్వం' చిత్రాలకు సెన్సార్‌ సమస్యలు తలెత్తనున్నాయా? అంటే అవుననే సమాధానం ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. హైదరాబాద్‌కు చెందిన యాంటీ టెర్రరిజమ్‌ ఫోరమ్‌ 'ఆచార్య, విరాటపర్వం' చిత్రాలకు సెన్సార్‌ సర్టిఫికేట్‌ ఇవ్వొద్దంటూ సెన్సార్‌ బోర్డుకు విజ్ఞప్తి చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు కారణం ఇటీవల చత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 22 మంది జవాన్లు చనిపోయారు. దీంతో మావోయిస్టుల చర్యలపై పెద్ద వ్యతిరేకత వచ్చింది. ఈ కమ్రంలో నక్సలిజం బ్యాక్‌డ్రాప్‌తో రూపొందిన 'ఆచార్య', 'విరాటపర్వం' సినిమాలకు సర్టిఫికేట్‌ జారీ చేయవద్దంటూ సెన్సార్‌ బోర్డును యాంటీ టెర్రరిజమ్‌ ఫోరమ్‌ కోరింది. ఒకవేళ ఇస్తే.. తాము అడ్డుకుంటామని తెలియజేసినట్లు సమాచారం. మరి నెట్టింట హల్‌చల్‌ చేస్తున్న ఈ వార్తలపై ఇటు 'ఆచార్య', 'విరాటపర్వం' మూవీ మేకర్స్‌, అటు సెన్సార్‌ బోర్డ్ ఎలా స్పందిస్తుందో చూడాలి.