Jun 10 2021 @ 12:11PM

ఎన్టీఆర్ కోసం బుచ్చిబాబు వెయిట్ చేస్తాడా..?

'ఉప్పెన' సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న బుచ్చిబాబు నెక్స్ట్ సినిమాను ఎన్టీఆర్‌తో చేసేందుకు ప్లాన్ చేసుకున్నాడని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఎన్టీఆర్ లైనప్ చేసుకున్న ప్రాజెక్ట్ పూర్తయ్యే వరకు బుచ్చిబాబు వెయిట్ చేయక తప్పదని తాజాగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చేస్తున్న ఎన్టీఆర్ ఆతర్వాత కొరటాల శివతో సినిమా చేయాల్సి ఉంది. ఇది పూర్తవగానే తన సినిమా ఉంటుందని బుచ్చిబాబు అనుకున్నారట. కానీ ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ ఓకే చేసుకున్నారు ఎన్టీఆర్. కొరటాల తర్వాత ప్రశాంత్ నీల్ సినిమా ఫిక్స్ అయింది. దాంతో బుచ్చిబాబు ఎంత లేదన్న ఓ రెండేళ్ళు వెయిట్ చేయాల్సిందే అని టాక్ వినిపిస్తోంది. అందుకే ఈ గ్యాప్‌లో మరో సినిమా పూర్తి చేయాలని ప్లాన్ చేసుకుంటున్నాడట. ఏ హీరోతో బుచ్చిబాబు నెక్స్ట్ ప్రాజెక్ట్ ఉండబోతుందనేది ప్రస్తుతానికైతే క్లారిటి లేదు.