విద్యాసంస్థలు నడిపితేనే కరోనా వస్తుందా...? సభలు, సమావేశాలు పెడితే రాదా?

ABN , First Publish Date - 2022-01-17T22:12:50+05:30 IST

రాజకీయ సభలు, సమావేశాలు పెడితే రాని కరో నా, విద్యాసంస్థలు నడిపితే వస్తుందా అని పీడీఎస్‌యూ రా ష్ట్ర ఉపాధ్యక్షుడు

విద్యాసంస్థలు నడిపితేనే కరోనా వస్తుందా...? సభలు, సమావేశాలు పెడితే రాదా?

నల్లగొండ రూరల్‌, జనవ రి 16: రాజకీయ సభలు, సమావేశాలు పెడితే రాని కరో నా, విద్యాసంస్థలు నడిపితే వస్తుందా అని పీడీఎస్‌యూ రా ష్ట్ర ఉపాధ్యక్షుడు ఇందూరు సా గర్‌ ప్రశ్నించారు. ఆదివారం ప ట్టణంలోని శ్రామిక భవనంలో నిర్వహించిన సమావేశంలో ఆ యన పాల్గొని మాట్లాడారు. సంక్రాంతి పండుగ పేరుతో సెలవులు ప్రకటించి, ఆ సెలవులను కరోనా పేరుతో పొడిగించడం వల్ల  బడుగు, బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులను ఉన్నత వి ద్యకు దూరం చేయడమేనని ఆరోపించారు. ప్రభుత్వం స్పందించి వెంటనే విద్యాసంస్థలను ప్రారంభించాలని డిమాండ్‌ చేశారు. లేనిచో విద్యార్థుల తరుపున పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు సురేష్‌, కార్యదర్శి రమేష్‌, నాయకులు హరికృష్ణ, మధు, గౌతమ్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-17T22:12:50+05:30 IST