అణుశక్తిని పెంచుతా.. 20 రోజుల తర్వాత కిమ్ తొలి వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2020-05-24T22:52:13+05:30 IST

దాదాపు 20 రోజులపాటు ఎవరికీ కనిపించకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన ఉత్తర కొరియా దేశాధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్.. ఆదివారం మిలటరీ అధికారులతో సమావేశం నిర్వహించారు.

అణుశక్తిని పెంచుతా.. 20 రోజుల తర్వాత కిమ్ తొలి వ్యాఖ్యలు

ప్యాంగ్యాంగ్: దాదాపు 20 రోజులపాటు ఎవరికీ కనిపించకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన ఉత్తర కొరియా దేశాధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్.. ఆదివారం మిలటరీ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ 20 రోజుల తర్వాత తొలిసారి ఆయన పాల్గొన్న పబ్లిక్ మీటింగ్ ఇదేనని కొరియన్ మీడియా పేర్కొంది. ఈ సందర్భంగా కిమ్ మాట్లాడుతూ.. కొరియా అణ్వస్త్ర సామర్ధ్యాన్ని పెంచుతానని హామీ ఇచ్చారు. అమెరికాతో అణ్వస్త్ర నిషేధంపై కొరియా జరుపుతున్న చర్చలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కిమ్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కాగా, ప్రపంచాన్ని కరోనా మహమ్మారి వణికిస్తుంటే ఉత్తర కొరియాలో మాత్రం ఇప్పటి వరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని అధికారులు చెప్తున్నారు. అయితే కరోనా నియంత్రణ చర్యలు మాత్రం ఈ దేశంలో జోరుగా చేపడుతున్నట్లు సమాచారం.

Updated Date - 2020-05-24T22:52:13+05:30 IST