Abn logo
Nov 26 2021 @ 03:57AM

జగనన్న పేకాట క్లబ్బులూ పెడతారేమో: తులసిరెడ్డి

వేంపల్లె, నవంబరు 25: ‘ఎవరు చేయాల్సిన పని వారే చేయాలి. జగన్‌ ప్రభుత్వం సినిమా టికెట్లు అమ్మాలనుకోవడం శోచనీయం’ అని పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తులసిరెడ్డి అన్నారు. గురువారం ఆయన వేంపల్లెలో విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వమే మద్యం దుకాణాలు నిర్వహించడం, మటన్‌, చికెన్‌, టీ కొట్టు, బజ్జీ సెంటర్లు నిర్వహించడం భావ్యమా? అని ప్రశ్నించారు. ప్రభుత్వం వాలకం చూస్తుంటే జగనన్న చికెన్‌ సెంటర్లు, జగనన్న పేకాట క్లబ్బులు కూడా పెట్టేట్లుందని ఎద్దేవా చేశారు.