అధికార పార్టీలకు మాత్రమే భూములు కేటాయిస్తారా

ABN , First Publish Date - 2020-08-12T10:33:07+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం గత ఎన్నికల ముందు గు ర్తింపు పొందిన అన్నిపార్టీలకు ఆయా జిల్లా కేంద్రంలో పార్టీ భవనాల కోసం ఒక ఎకరా భూమిని

అధికార పార్టీలకు మాత్రమే భూములు కేటాయిస్తారా

బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శ్రుతి


వనపర్తి రూరల్‌, ఆగస్టు 10: రాష్ట్ర ప్రభుత్వం గత ఎన్నికల ముందు గు ర్తింపు పొందిన అన్నిపార్టీలకు ఆయా జిల్లా కేంద్రంలో పార్టీ భవనాల కోసం ఒక ఎకరా భూమిని కేటాయిస్తానని, ఎన్నికల తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభు త్వం అధికారంలోకి వచ్చాక కేవలం టీఆర్‌ఎస్‌ పార్టీకి మాత్రమే భ వనాలు స్థలాలు కేటాయిస్తున్నారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు  శ్రుతి అన్నారు.


పట్టణ కేంద్ర సమీపంలోని నాగవరం శివారులో బీజేపీ నూతన కార్యాలయం భూమి పూజలో సోమవారం  ఆమె పాల్గొన్నారు. 32 జిల్లాలో నూతన బీజేపీ కార్యాలయాలకు డిజిటల్‌ వేదికగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్‌ప్రకాష్‌ నడ్డా శంకుస్థాపన చేయనున్నారని తెలిపారు. రాష్ట్ర  ప్రభుత్వం భూమి ఇవ్వకపోయినా బీజేపీ కేంద్ర పార్టీ తెలంగాణలోని 32 కార్యాలయాల కోసం పార్టీ నిధులు కేటాయించిందని కేవలం ఒక సంవత్సరంలోనే అంద మైన, సువిశాలైన భవనం పూర్తి చేసుకుందామన్నారు.


  కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రావుల రవీంద్రనాథ్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు మహేంద్ర, ప్రభాకర్‌రెడ్డి, ఓబీసీ మోర్చా రాష్ట్ర నాయకులు మున్నూరు రవీందర్‌ , మాజీ రాష్ట్ర సీనియర్‌ నాయకులు జింకల కృష్ణయ్య, భూజాల వెంకటేశ్వర్‌రెడ్డి, మాజీ జిల్లా ఉపాధ్యక్షులు రామమన్నగారి వెంకటేశ్వర్‌రెడ్డి, శ్రీశైలం, సీతారాములు, మాధ వరెడ్డి, దాసమోని సాయిరాం, మాజీ కోశాధికారి బండారు కుమారస్వామి, పట్టణ అధ్యక్షుడు రాంమోహన్‌, మాజీ జిల్లా కార్యదర్శులు అక్కల రామన్‌గౌడ్‌, గొర్ల బాబురావు, మాజీ వైస్‌ చైర్మన్‌ బాశెట్టి శ్రీనివాసులు, మాజీ అసెంబ్లీ కన్వీనర్‌ శ్రీనివాస్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-08-12T10:33:07+05:30 IST