Abn logo
Mar 9 2021 @ 12:33PM

మహేష్ మూడేళ్ళు లాకవుతాడా..?

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట అన్న సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. గీత గోవిందం సినిమాతో స్టార్ డైరెక్టర్స్ లిస్ట్‌లో చేరిన పరశురాం పెట్లా దరశకత్వం వహిస్తున్నాడు. కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే దుబాయ్‌లో నెలరోజుల భారీ షెడ్యూల్ కంప్లీట్ అయిన ఈ సినిమా మరో షెడ్యూల్ కూడా దుబాయ్‌లోనే ప్లాన్ చేస్తున్నట్టు లేటెస్ట్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా ఈ సినిమాని జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్ ప్లస్, మైత్రీ మూవీ మేకర్స్ కలిసి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. బ్యాంకింగ్ రంగంలో జరుగుతున్న ఆర్ధిక మోసాల నేపథ్యంగా ఈసినిమాని తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు పరశురాం. అయితే ఈ సినిమా తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు ఒక భారీ పాన్ ఇండియన్ సినిమా చేయాల్సి ఉంది. శ్రీ దుర్గ ఆర్ట్స్ బ్యానర్‌లో డా.కె.ఎల్.నారయణ భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నాడు. 

ఇప్పటికే ఈసినిమా కథ కూడా రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ రెడీ చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ అక్టోబర్ 13న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. ఈసినిమా రిలీజ్ తర్వాత మహేష్ బాబుతో రాజమౌళి కొత్త ప్రాజెక్ట్‌ని వెంటనే మొదలవుతుందని భావించారు. కాని రాజమౌళి పూర్తి స్థాయి కథ సిద్దం చేసి మహేష్‌కి  వినిపించడానికే చాలా సమయం పడుతుందని చెప్పుకుంటున్నారు. అంతేకాదు ఆర్ఆర్ఆర్ రిలీజ్ తర్వాత కనీసం రెండు మూడు నెలలైనా రెస్ట్ తీసుకుంటాడని సమాచారం. ఈరకంగా చూస్తే రాజమౌళి, మహేష్‌ల కొత్త ప్రాజెక్ట్ మొదలయ్యేది వచ్చే ఏడాదే అని తెలుస్తోంది. అంతేకాదు రాజమౌళితో సినిమా అంటే హీరో ఖచ్చితంగా రెండు నుంచి మూడేళ్ళు లాకవ్వాల్సిందే. మరి మహేష్.. రాజమౌళి దగ్గర మూడేళ్ళు లాకవగలడా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.        

Advertisement
Advertisement
Advertisement