ప్రిన్స్ ఫిలిప్ వీలునామా 90 ఏళ్ళపాటు రహస్యం : హైకోర్టు

ABN , First Publish Date - 2021-09-17T18:55:37+05:30 IST

ప్రిన్స్ ఫిలిప్ రాసిన వీలునామాను 90 ఏళ్ళపాటు

ప్రిన్స్ ఫిలిప్ వీలునామా 90 ఏళ్ళపాటు రహస్యం : హైకోర్టు

లండన్ : ప్రిన్స్ ఫిలిప్ రాసిన వీలునామాను 90 ఏళ్ళపాటు రహస్యంగా ఉంచాలని హైకోర్టు ఆదేశించింది. ఆయన సతీమణి క్వీన్ ఎలిజబెత్-2 గౌరవ, మర్యాదలను కాపాడటం కోసం ఆయన రాసిన వీలునామాను సీలు వేసి ఉంచాలని తెలిపింది. జడ్జి ఆండ్రూ మెక్‌‌ఫార్లేన్ గురువారం ఈ తీర్పు చెప్పారు. 


ప్రిన్స్ ఫిలిప్ ఏప్రిల్‌లో మరణించారు. ఆయన సతీమణి క్వీన్ ఎలిజబెత్-2 బ్రిటన్ దేశాధినేతగా ఉన్నారు. బ్రిటన్‌లో వీలునామాలు బహిరంగ దస్తావేజులే. అయితే దాదాపు ఓ శతాబ్దం నుంచి సీనియర్ రాజ వంశీకుల వీలునామాలను హైకోర్టు ఆదేశాల మేరకు రహస్యంగా ఉంచుతున్నారు. 


ప్రిన్స్ ఫిలిప్ రాసిన వీలునామాను 90 సంవత్సరాలపాటు సీలు వేసి ఉంచాలని జడ్జి ఆండ్రూ మెక్‌ఫార్లేన్ తీర్పు చెప్పారు. ఆ తర్వాత దానిని ప్రైవేటుగా తెరచి చూసి, దానిని ప్రచురించడంపై నిర్ణయం తీసుకోవాలని తెలిపారు. ఈ వీలునామాను తాను చూడలేదని, అందులోని వివరాలను తనకు ఎవరూ చెప్పలేదని తెలిపారు. 


Updated Date - 2021-09-17T18:55:37+05:30 IST