పెట్రోల్‌ బంక్‌ మోసాలు ఆగేనా?

ABN , First Publish Date - 2021-06-14T05:08:25+05:30 IST

ప్రస్తుత రోజుల్లో వాహనం ఓ నిత్యావసర వస్తువుగా మారింది. గతంలో సుదూర ప్రాంతాలకు వెళ్లాలనుకుంటే ఆర్టీ సీ బస్సులు, రైల్వేను ఆశ్రయించే వారు.

పెట్రోల్‌ బంక్‌ మోసాలు ఆగేనా?
కామారెడ్డిలో పెట్రోల్‌ వ్యత్యాసాలపై ఆందోళన నిర్వహిస్తున్న వాహనదారులు(ఫైల్‌)

ఫ డీజిల్‌, పెట్రోల్‌ పంపింగ్‌లో వ్యత్యాసం
ఫ ఉచితంగా కొట్టాల్సిన గాలికి కూడా పైసలు వసూలు చేస్తున్న సిబ్బంది
ఫ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా దక్కని న్యాయం
ఫ జిల్లా ఉన్నతాధికారులు దృష్టి సారిస్తేనే మేలంటున్న వాహనదారులు

కామారెడ్డి టౌన్‌, జూన్‌ 13: ప్రస్తుత రోజుల్లో వాహనం ఓ నిత్యావసర వస్తువుగా మారింది.  గతంలో సుదూర ప్రాంతాలకు వెళ్లాలనుకుంటే ఆర్టీ సీ బస్సులు, రైల్వేను ఆశ్రయించే వారు.  ప్రస్తుతం కరోనా మహమ్మారి భయంతో పెద్దఎత్తున వాహనాలను వినియోగిస్తూ ప్రజలు తమ పనుల ను చేసుకుంటున్నారు. ఇంటి నుంచి కాలు బయట పెట్టాలంటే వాహనం తీయాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. అయితే వాహనం నడవాలంటే పెట్రోల్‌, డీజిల్‌ కీలకం. ఈ ఇంధనాలు సైతం ప్రస్తుతం లీటరుకు రూ.100కు చేరువ కావడంతో తమ బడ్జెట్‌ను బ్యాలెన్స్‌ చేసుకుంటూ బం క్‌లో పెట్రోల్‌, డీజిల్‌ను వాహనాలలో పోయించుకుంటూ ప్రయాణాలు సాగిస్తున్నారు. అసలే ధరల పెరుగుదల ఒకవైపు.. కరోనా మహమ్మారితో ఆర్థిక ఇబ్బందులతో జీవనాన్ని నెట్టుకొస్తుంటే కొన్ని బంక్‌ల నిర్వాహకులు ప్రజలను మరింత మోసం చేస్తున్నారు. లీటరు పెట్రోల్‌కు 100 ఎంఎల్‌ నుంచి 250 ఎంఎల్‌ వరకు తక్కువగా పోస్తూ తమ జేబులు నింపుకుంటున్నారు. అసలే లాక్‌డౌన్‌ ఆటోల్లో లగేజీ తీసుకునే పోయే ఆటోవాలాలు, ద్విచక్ర వాహనదారులు నిత్యం బంక్‌లు చేసే మోసానికి బలైపోతున్నారు. లీటరు పెట్రోల్‌కు 60కిలో మీటర్లు రావాల్సిన వాహన మైలేజ్‌ 40 కిలో మీటర్లు రాకపోవడంతో మెకానిక్‌ల వద్దకు వెళితే మైలేజ్‌కి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేవని కేవలం పెట్రోల్‌ బంక్‌ల నిర్వాహకులు చేసే మోసంతోనే వాహనం మైలేజ్‌ తక్కువగా వస్తోందని సమాధానం ఇస్తుం డడంతో ప్రజలు ముక్కున వేలేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. పెట్రోల్‌, డీజిల్‌ వ్యత్యాసంలో బంక్‌ నిర్వాహకులను ప్రశ్నించినప్పుడల్లా ఎదురుదాడికి దిగడం.. మీకు నచ్చిన వారికి చెప్పుకొండంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. తీరా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకుపోయినా కాలయాపన చేయడం, లేదంటే తూతూ మంత్రంగా చర్యలకు ఉపక్రమిస్తుండడంతో బంక్‌ నిర్వాహకులు ఆడిందే ఆట పాడిందే పాటగా మారుతోందని వాహనదారులు వాపోతున్నారు.

వినియోగదారులను మోసం చేస్తే ఫిర్యాదు చేయవచ్చు
ఫ గజ్జెల భిక్షపతి, జిల్లా వినియోగదారుల సంఘ
సమాఖ్య గౌరవ అధ్యక్షుడు, కామారెడ్డి
పెట్రోల్‌, డీజిల్‌ పంపింగ్‌లో మోసానికి పాల్పడితే సంబంధిత శాఖ అధికారుల దృష్టికి తీసుకుపోవాలి. అక్కడ కూడా సరైన న్యాయం జరగకపోతే మా దృష్టికి తీసుకువస్తే కన్జ్యూమర్‌ కోర్టులో తగిన న్యాయం జరిగే లా చూస్తాం. ప్రతీ పెట్రోల్‌ బంక్‌ నిబంధనలకు అనుగుణంగానే వ్యవహరించాలి. తూనికలు కొలతల, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు సైతం ఎప్పటికప్పుడు తనిఖీలు చేపట్టి వినియోగదారులకు సరైన సేవలు అందేలా చర్య లు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నాం. వినియోగదారులకు ఎలాంటి అసౌకర్యం కలిగినా తమ దృష్టికి తీసుకువస్తే న్యాయం జరిగేలా చూస్తాం.

మోసాలకు పాల్పడితే చర్యలు తప్పవు
ఫ కొండ ల్‌రావు, డీఎస్‌వో, కామారెడ్డి
పెట్రోల్‌, డీజిల్‌ పంపింగ్‌లో మోసాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసు కుంటాం. నిబంధనలకు అనుగుణంగా వాహనదారులకు బంక్‌లలో అన్ని వసతులు కల్పించాలి. సిరిసిల్లా రోడ్డులోని ఎస్సార్‌ పెట్రోల్‌ బంక్‌పై వచ్చి న ఫిర్యాదుపై సంబంధిత బంక్‌కు నోటీసులు పంపిస్తాం. నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించినట్లయితే చర్యలు తీసుకుంటాం.

Updated Date - 2021-06-14T05:08:25+05:30 IST